Begin typing your search above and press return to search.

'స్మార్ట్ లైఫ్' కవర్ పేజీలో ఇస్మార్ట్ బ్యూటీ!

By:  Tupaki Desk   |   9 May 2020 7:30 AM GMT
స్మార్ట్ లైఫ్ కవర్ పేజీలో ఇస్మార్ట్ బ్యూటీ!
X
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్.. హైదరాబాద్ లో పుట్టిన ఈ గ్లామర్ డాల్ ముంబైలో పెరిగి అక్కడే సెటిల్ అయింది. 'మున్నా మైకెల్' సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన నిధి.. నాగచైతన్య సరసన 'సవ్యసాచి' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే టైగర్ ష్రాఫ్ తో కాలు కదపడంతో అందరి దృష్టి తన వైపు మళ్లింది. మున్నా మైకెల్ సినిమాలో నిధిని చూసిన ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు అనుకుంది కానీ అవకాశాలు మాత్రం నిధికి ఆమడ దూరంలో ఉంటున్నాయి. ఇండస్ట్రీలోకి ఎన్నో కష్టాలు పడి వచ్చిన నిధి.. బాలీవుడ్ లో అదృష్టం కలిసి రాలేదని.. 'సవ్యసాచి' సినిమాతో తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆశలు పెట్టుకున్న సినిమా ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో అమ్మడు కాస్త టైం తీసుకొని అఖిల్ హీరోగా నటించిన 'మిస్టర్ మజ్ను'లో కన్పించింది. అది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

ఇక గతేడాది పూరీ జగన్నాథ్ దర్శకత్వలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్ లో మొదటి హిట్ ను అందుకుంది. ఇక అవకాశాల కోసం గ్లామర్ షో చేయాలని గ్రహించి గ్లామర్ డోస్ పెంచేసింది. ముఖ్యంగా సిలక సిలక, ఉండిపో లాంటి సాంగ్స్ లో ఆమె అందాల ఆరబోత మాములుగా చేయలేదు. తన కెరీర్లో ఐటమ్ సాంగ్స్ చేయనని ముందే చెప్పేసింది. కానీ సిలక సిలక సాంగ్ తో ఐటెం హీరోయిన్ కంటే ఎక్కువ పేరును సంపాదించుకుంది. ఇక నిధి మతిపోగోట్టే డ్రెస్సింగ్ స్టైల్, ప్రేక్షకులను హీటెక్కించే డాన్స్ మూమెంట్స్ ఇలా అబ్బో.. థియేటర్లలో పెద్ద పరువాల ధారనే కురిపిస్తా అంటుంది. కానీ ఏం లాభం అవకాశాలు కరువు. కానీ సోషల్ మీడియాలో ఎల్లపుడు యాక్టీవ్ గా ఉంటుంది. నిజానికి నిధికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఈ మధ్య నిధి స్మార్ట్ లైఫ్ అనే మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఫోటో షూట్ లో పాల్గొన్నది. అయితే ఆ మ్యాగజైన్ ఈ నెల ఎడిషన్ లో నిధి లైఫ్ స్టోరీ.. తన కెరీర్ ఎలా ప్రారంభం అయిందో.. ప్రస్తుతం రాబోయే మ్యాగజైన్లో వివరించనుందట. ప్రస్తుతం ఆ మ్యాగజైన్ కవర్ పేజీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.