Begin typing your search above and press return to search.

స్మార్ట్‌ బ్యూటీ థైస్ తో రెచ్చగొడుతోంది

By:  Tupaki Desk   |   31 Jan 2022 5:23 AM GMT
స్మార్ట్‌ బ్యూటీ థైస్ తో రెచ్చగొడుతోంది
X
మున్నా మైఖేల్‌ అనే హిందీ సినిమా తో 2017 సంవత్సరంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ 2018 సంవత్సరంలో సవ్య సాచి చిత్రంలో నాగ చైతన్య కు జోడీగా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ వెంటనే అఖిల్‌ హీరోగా వచ్చిన మిస్టర్ మజ్ను సినిమా లో హీరోయిన్ గా నటించింది. మొదటి మూడు సినిమాలు కూడా నిధి అగర్వాల్ కు పెద్దగా స్టార్‌ డమ్‌ ను తెచ్చి పెట్టలేక పోయాయి. కమర్షియల్‌ బ్రేక్‌ కోసం వెయిట్‌ చేస్తున్న అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ కు డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్ రూపంలో ఇస్మార్ట్‌ శంకర్ అవకాశం దక్కింది. ఇస్మార్ట్‌ శంకర్ కమర్షియల్‌ గా నిధి అగర్వాల్‌ కు మొదటి సక్సెస్ ను తెచ్చి పెట్టింది. అప్పటి నుండి వెను దిరిగి చూడకుండా ఈ అమ్మడి జర్నీ కొనసాగుతోంది.

2019 లో ఇస్మార్ట్‌ శంకర్ సినిమా సక్సెస్ అవ్వడంతో 2020 లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తాయని అంతా భావిస్తున్న సమయంలో అనూహ్యంగా కరోనా వల్ల అమ్మడికి ఆఫర్లు పెద్దగా రాలేదు. అయితే హరి హర వీరమల్లు సినిమాలో నటించే అవకాశం దక్కడంతో ఈ అమ్మడు మళ్లీ టాలీవుడ్ లో టాప్ స్టార్‌ హీరోయిన్ గా మారే అవకాశం దక్కించుకున్నట్లయ్యింది. హీరోయిన్ గా నిధి అగర్వాల్‌ ఇటీవలే గల్లా అశోక్‌ తో కలిసి 'హీరో' సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా నిరాశ పర్చినా కూడా ఈ అమ్మడు పవన్‌ మూవీ పై చాలా ఆశలు పెట్టుకుంది. ప్రతి ఇంటర్వ్యూలో కూడా పవన్ తో చేస్తున్న హరి హర వీరమల్లు సినిమా గురించిన ముచ్చట్లు చెబుతోంది.

ఇక ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫొటోలు షేర్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు ఈ థైస్ ఎక్స్ పోజ్ చేస్తున్న ఫొటోలను షేర్‌ చేసింది. నెట్టింట ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. పెద్ద ఎత్తున ఈ ఫొటోల్లో నిధి అగర్వాల్ అందాల ఆరబోత చేయడంతో పాటు చాలా క్యూట్‌ గా కూడా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. పేరుకు తగ్గట్లుగా అందాలను నిధిగా పోసినట్లుగా ఉండే ఈ అమ్మడు హరి హర వీరమల్లు సినిమా తర్వాత టాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా మారడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం తెలుగు లో మాత్రమే కాకుండా హిందీ మరియు తమిళంలో కూడా ఈ అమ్మడు సినిమాలు చేస్తోంది. ఇక ఈమె ఒక తమిళ హీరోతో రిలేషన్‌ లో ఉన్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.