Begin typing your search above and press return to search.

ఇజం ఎఫెక్ట్.. మరింత లేట్

By:  Tupaki Desk   |   23 Oct 2016 11:00 PM IST
ఇజం ఎఫెక్ట్.. మరింత లేట్
X
ఇజం.. నందమూరి కళ్యాణ్ రామ్-పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ రిజల్ట్ ఏంటో రిలీజ్ రోజే తెలిసిపోయింది. అయినా మొదటి రోజు కలెక్షన్స్ కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ రావడంతో కొంచెం ఆశలు మిగిలున్నాయి. శనివారం వసూళ్లు.. సండే బుకింగ్స్ చూస్తే.. ఇవి కూడా ఆవిరైపోయినట్లే.

అయితే.. నందమూరి ఫ్యాన్స్ భయపడుతున్న విషయం ఇంకోటి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ తన తర్వాతి సినిమాను పూరీ జగన్నాధ్ తో చేసే అవకాశాలున్నాయన్న విషయంపై అభిమానుల్లో ఆందోళన ఉంది. అసలు ప్లాపుల్లో ఉన్న ఎన్టీఆర్ ని టెంపర్ తో హిట్ ట్రాక్ ఎక్కించిన వ్యక్తి పూరీనే అయినా.. ఆ స్టోరీ మాత్రం పూరీది కాదనే విషయం అందరికీ తెలుసు. వక్కంతం వంశీ కథను.. పర్ఫెక్ట్ గా చూపించి బాగానే సక్సెస్ అయ్యాడు పూరీ. జ్యోతిలక్ష్మి-లోఫర్-ఇజం లతో హ్యాట్రిక్ సాధించిన పూరీతో.. టెంపర్-నాన్నకు ప్రేమతో-జనతా గ్యారేజ్ లతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన హీరో ఎలా సినిమా తీస్తాడన్నది ఫ్యాన్స్ క్వశ్చన్.

హిట్ కొట్టలేనంత బ్యాడ్ స్టేజ్ లో పూరీ లేకపోయినా.. అందుకు మంచి స్టోరీ కావాలి. అలా కావాలంటే మరింత టైమ్ అవసరం అవుతుంది. ఇప్పటికే ఎన్టీఆర్ కి స్టోరీ చెప్పేసి మరీ వెయిటింగ్ చేస్తున్నాడు పూరీ. దీనిపై జూనియర్ కి పూర్తిగా కాన్ఫిడెన్స్ లేదని.. ఇన్నాళ్లు ఆగడంతోనే అర్ధమైపోయింది. ఇప్పటికిప్పుడు అదే స్టోరీకి ఓటేసి పూరీకి ఎన్టీఆర్ ఛాన్స్ ఇచ్చే అవకాశాలు తక్కువే అని టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/