Begin typing your search above and press return to search.
పార్టీలు ఫంక్షన్లకు యంగ్ బ్యూటీతో దిగిపోతున్న కుర్రహీరో
By: Tupaki Desk | 6 Jan 2021 9:17 AM ISTబాలీవుడ్ లో ఫేజ్- 3 పార్టీ కల్చర్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. అక్కడ నిరంతరం బర్త్ డే పార్టీలు వెడ్డింగ్ పార్టీలు వీటికి తోడు అప్పుడప్పుడు ఇల్లు ఒళ్లు మరిచేలా స్పెషల్ పార్టీలు ఎప్పటికప్పుడు చాలా కామన్.
ఇలాంటి పార్టీలకు విందు వినోదాలకు తప్పనిసరిగా ఎటెండయ్యేందుకు బాలీవుడ్ యంగ్ ట్యాలెంట్ పోటీపడుతుంటారు. ఇందులో కొందరు ట్రెండింగ్ లవ్ కపుల్స్ ఇచ్చే ట్రీట్ మామూలుగా ఉండదు. పార్టీలో కళ్లన్నీ ఆ జంటలపైనే వాలిపోయేలా అక్కడ హల్ చల్ చేయడం చూసేదే.
బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకొనే తన 35వ పుట్టినరోజును మంగళవారం(జనవరి 5) నాడు జరుపుకున్నారు. తన భర్త రణ్ వీర్ సింగ్ తో కలిసి సాయంత్రం గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేయగా ఇందులో లవ్ కపుల్స్ సందడి ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. ఈ పార్టీలో దీపిక మాజీ ప్రియుడు రణబీర్ తన ప్రియురాలు ఆలియాభట్ తో సందడి చేయగా.. మరో యంగ్ కపుల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మొన్నటికి మొన్న మాల్దీవుల విహారానికి జంటగా వెళ్లిన ఇషాన్ ఖత్తర్- అనన్య పాండే జంట ఈ పార్టీలో దిగిపోవడంతో.. వీళ్ల వ్యవహారంపై ఆసక్తికర చర్చ సాగింది. పార్టీ ఆద్యంతం బ్లాక్ డ్రెస్ కోడ్ మెయింటెయిన్ అవ్వగా ఇషాన్ - అనన్య వైట్ కాంబినేషన్ డ్రెస్ లో ఎంతో ప్రత్యేకంగా పార్టీకే హైలైట్ గా కనిపించారు. ఖలీ పీలీలో జంటగా నటించాక ఆ ఇద్దరి మధ్యా ఏదో జరుగుతోందన్న గుసగుసలు మరోసారి వేడెక్కించాయి.
ఈ గ్రాండ్ పుట్టినరోజు పార్టీలో కరణ్ జోహార్- సిద్ధాంతు చతుర్వేది--రోహన్ శ్రేష్ట- రితికా భవానీ- సిద్ధార్థ్ ఆనంద్- అంజని ధావన్- శకున్ బాత్రా- అయాన్ ముఖర్జీ- మధు మంతెన తదితరులు పాల్గొన్నారు.