Begin typing your search above and press return to search.

జాన్వీతో ఎఫైర్ పై స్పందించిన యంగ్ హీరో!

By:  Tupaki Desk   |   9 May 2019 5:43 PM GMT
జాన్వీతో ఎఫైర్ పై స్పందించిన యంగ్ హీరో!
X
హీరోయిన్ గా పరిచయం కాక ముందే శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ తన స్నేహితుడు ఇషాన్ ఖట్టర్ తో ప్రేమలో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. వీరిద్దరూ ఒకే సినిమాతో ఇంట్రడ్యూస్ కావడం ఆ చర్చను మరింతగా సాగించింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అలా ఊహాగానాలు చెలరేగాయి. అందుకు తగ్గట్టుగా వీరు తరచూ జంటగా కనిపించారు. డిన్నర్ డేట్స్ తో వార్తల్లోకి వచ్చారు.

అయితే అది స్నేహమా - ప్రేమా.. అనే విషయం పై ఎవరికీ క్లారిటీ లేకపోయింది. వీరిద్దరి విషయంలో అలా రూమర్లు మాత్రం కొనసాగాయి. ఇక తాజాగా ఆ అంశంపై ఇషాన్ ఖట్టర్ మరోసారి స్పందించాడు. సూటిగా కాకుండా.. అనుమానాలను కలిగించే విధంగానే అతడు స్పందించడం విశేషం. 'నీకూ జాన్వీ కపూర్ కు మధ్య ఏం నడుస్తోంది..' అన్నట్టుగా టాక్ షోలో నేహా దూపియా అడుగగా.. సూటిగా స్పందించలేదు ఇషాన్.

'నేను ప్రస్తుతం రిలేషన్ షిప్ లో ఉన్నాను..అది కాఫీతో..' అంటూ చెప్పుకొచ్చాడు ఈ హీరో. జాన్వీతో రిలేషన్ షిప్ మాట గురించి సూటిగా స్పందించకుండా.. 'కాఫీతో రిలేషన్ షిప్' అంటూ ఇతడు తమ ప్రేమకథను మిస్టరీగానే మిగిల్చాడు. తమ మధ్య ప్రేమ ఉందని అనకుండా, లేదని అనకుండా.. తెలివిగా సమాధానం ఇచ్చాడు. ఇది వరకూ జాన్వీ కపూర్ మాత్రం తనకూ, ఇషాన్ కు మధ్యన అలాంటిదేమీ లేదని కాఫీ విత్ కరణ్ షో లో చెప్పింది.