Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరో తమ్ముడి నిర్లక్ష్యంకు ఫైన్‌

By:  Tupaki Desk   |   16 April 2019 7:01 AM GMT
స్టార్‌ హీరో తమ్ముడి నిర్లక్ష్యంకు ఫైన్‌
X
బాలీవుడ్‌ స్టార్‌ హీరో షాహిద్‌ కపూర్‌ సోదరుడు ఇషాన్‌ ఖట్టర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇతడు ఇప్పటికే 'ధడక్‌' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుపరిచితుడు అయ్యాడు. తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ కుర్ర హీరో తన కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇదే సమయంలో ఇతడు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను వార్తల్లోకి ఎక్కాడు. బైక్స్‌ అంటే తెగ ఇష్టపడే ఇషాన్‌ ముంబయిలో ఎక్కువగా బైక్‌ పైనే తిరుగుతాడట. తాజాగా ముంబయిలోని ఒక ఏరియాలోని రెస్టారెంట్‌ కు ఇషాన్‌ బైక్‌ పై వెళ్లాడు.

బైక్‌ ను నో పార్కింగ్‌ ఏరియాలో పార్క్‌ చేసి రెస్టారెంట్‌ లోనికి వెళ్లాడు. అదే సమయంలో నో పార్కింగ్‌ ఏరియాలో ఉన్న బండ్లను తొలగించుకుంటూ వస్తున్న పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం నో పార్కింగ్‌ ఏరియాలో ఉన్న ఇషాన్‌ బండిని కూడా పైకి ఎక్కించడం జరిగింది. విషయం తెలుసుకున్న ఇషాన్‌ పరుగు పరుగున రెస్టారెంట్‌ నుండి బయటకు వచ్చాడు. అప్పటికే బండిని పైకి ఎక్కించడంతో పోలీసులకు ఇషాన్‌ రిక్వెస్ట్‌ చేశాడు. బండి పైకి ఎక్కిన నేపథ్యంలో స్టేషన్‌ కు వచ్చి ఫైన్‌ కట్టి బండిని తీసుకు వెళ్లాల్సిందే అంటూ పోలీసులు చెప్పడంతో ఇషాన్‌ ఎంత డబ్బయినా ఇస్తాను బండిని దించండి అంటూ విజ్ఞప్తి చేయడంతో, మొదటి తప్పుగా పరిగణించి 500 రూపాయల ఫైన్‌ విధించి బండిని కిందకు దించడం జరిగింది.

అప్పటికే ఇషాన్‌ అని గుర్తించిన రోడ్డున పోయే వారు అతడిని చూసి అక్కడ ఆగారు. చాలా మంది అతడిని ఫొటోలు తీసుకునేందుకు సిద్దం అయ్యారు. అయితే ఇషాన్‌ బండి కిందకు దించిన వెంటనే హెల్మెట్‌ పెట్టుకుని అక్కడ నుండి వెళ్లి పోయాడు. ఎంత సెలబ్రెటీ అయినా మాత్రం ట్రాఫిక్‌ రూల్స్‌ ను పాటించకుంటే ఇలాంటి సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుందని మరోసారి నిరూపితం అయ్యింది.