Begin typing your search above and press return to search.

ఇషాన్ పై అంచ‌నాలు పెంచుతున్న ట్రైల‌ర్‌

By:  Tupaki Desk   |   5 April 2018 7:20 AM GMT
ఇషాన్ పై అంచ‌నాలు పెంచుతున్న ట్రైల‌ర్‌
X

ఇషాన్ క‌ట్ట‌ర్‌- బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ క‌పూర్ త‌మ్ముడు. త్వ‌ర‌లో ‘ధ‌డ‌క్’ సినిమా ద్వారా బాలీవుడ్‌లో హీరోగా ప‌రిచ‌యం కాబోతున్నాడు. ఇందులో అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి త‌న‌య జాన్వి క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తూ తెరంగ్రేటం చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే అంత‌కు ముందే ఇషాన్‌...ఓ హాలీవుడ్ సినిమా చేసేశాడు. హాలీవుడ్ లెజండ‌రీ ద‌ర్శ‌కుడు మ‌జిద్ మ‌జిదీ తెర‌కెక్కించిన ‘బియాండ్ ద క్లౌడ్స్‌’ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించాడు ఇషాన్‌.

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుని... లండ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌ లో ప్ర‌ద‌ర్శిత‌మైన ఈ సినిమా నుంచి తాజాగా రెండో ట్రైల‌ర్ విడుద‌ల‌యింది. ఈ ట్రైల‌ర్ కి అన్ని వ‌ర్గాల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. ఇషాన్ క‌ట్ట‌ర్ ఈ సినిమాలో అక్క‌తో క‌లిసి జీవించే ఓ స్ల‌మ్ కుర్రాడిగా న‌టిస్తున్నాడు. అత‌ని అక్కగా మ‌ల‌యాళ న‌టి మాల‌వికా మోహ‌న‌న్ న‌టిస్తోంది. అనుకోకుండా ఓ వ్య‌క్తిని హ‌త్య చేసేందుకు ప్ర‌య‌త్నించి- జైలు పాల‌వుతుంది మాల‌వికా. అందుకు కార‌ణ‌మైన వ్య‌క్తిని చంపడానికి ప్ర‌య‌త్నిస్తుంటాడు ఇషాన్‌. ఈ ప్ర‌య‌త్నంలో ఆ వ్య‌క్తి కుటుంబం ప‌రిచ‌య‌మ‌వుతుంది. అలా అనుకోకుండా క‌లిసిన వ్య‌క్తుల మ‌ధ్య ఏర్ప‌డే బంధాలు... అనుబంధాలే ఈ సినిమా క‌థ‌గా తెలుస్తోంది.

ఇషాన్ క‌ట్ట‌ర్ న‌ట‌న చూస్తుంటే... భ‌విష్య‌త్తులో బాలీవుడ్‌ లో టాప్ స్టార్ హీరోగా పాగా వేసే అవ‌కాశాలు బాగానే క‌నిపిస్తున్నాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్ 20న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇంగ్లీష్‌- హిందీ- త‌మిళం... మూడు భాషల్లో విడుద‌ల‌వుతోందీ చిత్రం.

ట్రైలర్ చూడటానికి క్లిక్ చేయండి