Begin typing your search above and press return to search.

లైగర్ బ్యూటీ బ్రేకప్ పై ఫుల్‌ క్లారిటీ వచ్చేసింది

By:  Tupaki Desk   |   9 Sep 2022 5:30 PM GMT
లైగర్ బ్యూటీ బ్రేకప్ పై ఫుల్‌ క్లారిటీ వచ్చేసింది
X
రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాలో బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ అనన్య పాండే నటించిన విషయం తెల్సిందే. లైగర్ సినిమా నిరాశ పర్చిన కూడా అనన్య పాండే కు మంచి రీచ్ అయితే దక్కింది. బాలీవుడ్‌ లో కూడా ఈ అమ్మడు ప్రస్తుతం వరుసగా సినిమాలకు కమిట్‌ అవుతూ బిజీ బిజీగా ఉంది. ఇదే సమయంలో ఆమెకు సంబంధించిన ఒక విషయమై క్లారిటీ వచ్చింది.

అనన్య పాండే మరియు బాలీవుడ్‌ యంగ్‌ హీరో ఇషాన్ ఖట్టర్ లు 'ఖాళీ పీలి' సినిమా సమయం నుండి బాగా క్లోజ్ అయ్యారు. ఇద్దరు పార్టీలు పబ్‌ లు అంతకు మించి అన్నట్లుగా తిరిగే వారు. ఇద్దరి వ్యవహారం ఎన్నో సార్లు మీడియా ద్వారా బయటకు వచ్చింది. ఇద్దరు ప్రేమలో ఉన్నట్లుగా బాలీవుడ్ నుండి కూడా కన్ఫర్మేషన్ వచ్చింది.

ఇద్దరు కెరీర్‌ ఆరంభంలోనే ఉన్నారు.. అప్పుడే ప్రేమ ఏంటో అంటూ కొందరు కామెంట్స్ చేయగా.. కొందరు వీరి ప్రేమ ఎన్నాళ్లు ఉంటుందో అన్నట్లుగా అనుమానాలు వ్యక్తం చేసేవారు. కొందరు ఊహించినట్లుగానే ఇద్దరి బ్రేకప్ కి ఎక్కువ సమయం పట్టలేదు.

గత కొన్నాళ్లుగా వీరిద్దరు బ్రేకప్ అయ్యారంటూ వార్తలు వస్తున్నాయి.. కానీ క్లారిటీ లేదు. ఎట్టకేలకు ఇషాన్ కట్టర్ నుండి ఆ విషయమై క్లారిటీ వచ్చింది.

తాజాగా కత్రీనా కైఫ్‌ మరియు సిద్ధాంత్ చతుర్వేది తో కలిసి ఇషాన్ కాఫీ విత్ కరణ్‌ టాక్ షో లో పాల్గొన్నాడు. ఆ సమయంలోనే ఇషాన్ ని కరణ్ బ్రేకప్‌ గురించి ప్రశ్నించగా.. ప్రస్తుతానికి తాను సింగిల్ అన్నాడు.

అంతే కాకుండా జీవితాంతం అనన్య తో స్నేహంగా ఉండాలని.. ఆమెకు ఒక మంచి స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ఫుల్‌ క్లారిటీ ఇచ్చేశాడు. అనన్య మాత్రం ఇప్పటి వరకు ఈ విషయమై నోరు విప్పలేదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.