Begin typing your search above and press return to search.

'వర్కౌట్' వీడియోతో హల్చల్ చేస్తున్న తెలుగు వయ్యారి!

By:  Tupaki Desk   |   12 March 2021 12:49 PM GMT
వర్కౌట్ వీడియోతో హల్చల్ చేస్తున్న తెలుగు వయ్యారి!
X
ఇండస్ట్రీలో హీరోయిన్స్ స్టోరీ డిమాండ్ మేరకు వర్కౌట్స్ చేసి పాత్రకు సూటబుల్ గా మారేందుకు చాలా కష్టపడుతుంటారు. కానీ కొందరు హీరోయిన్స్ మాత్రం క్యారెక్టర్ డిమాండ్స్ సంగతి ఏమోగానీ ముందుగా అవకాశాలు రావాలంటూ స్లిమ్ గా తయారవుతుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరీర్ సాగిస్తున్న తెలుగు వయ్యారులు తక్కువమంది ఉన్నారు. అందులోనూ తెలుగులో అవకాశాలు పొందడమే వీళ్లకు కష్టంగా మారింది. అలా సరైన అవకాశాలు లేక వెయిటింగ్ లో ఉన్న హీరోయిన్ ఈషారెబ్బ. ఈ అమ్మడు కెరీర్ ప్రారంభించి ఎనిమిది సంవత్సరాలు పూర్తికావస్తుంది. కానీ ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదని చెప్పాలి.

ఈషా లీడ్ హీరోయిన్ గా ఇప్పటికి భారీ హిట్ కొట్టాల్సింది. కానీ అందంతో పాటు గ్లామర్ రోల్స్ చేసేందుకు సిద్ధంగా ఉన్నా అదృష్టం సరిగా లేదేమో అనిపిస్తుంది. మొదట్లో గ్లామర్ రోల్స్ చేసేందుకు వెనకాడింది. కానీ ఇప్పుడు అలాంటి హద్దులేవి పెట్టుకోలేదట. ఆ మధ్య అన్ని రోల్స్ చేయడానికి రెడీ అంటూ చెప్పేసింది. ఇదిలా ఉండగా.. ఈషాకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ఫ్యాన్స్ కోసం ఎప్పటికప్పుడు అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా వర్కౌట్ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఈషా తెగకష్టపడుతుంది. మరి ఆల్రెడీ ఈషా క్యూట్ గా, ఫిట్ గానే ఉంది. మరి లీడ్ హీరోయిన్ గా ఎప్పుడు బిజీ అవుతుందో అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాలో ఓ రోల్ ప్లే చేసింది ఈషా. చూడాలి మరి ఈ ముప్పై ఏళ్ల సుందరి బిజీ అవుతుందేమో!