Begin typing your search above and press return to search.

తెలుగ‌మ్మాయి ఇషా రెబ్బా మేక‌ప్ లెస్ ఫోజు వైర‌ల్

By:  Tupaki Desk   |   9 April 2021 4:30 PM GMT
తెలుగ‌మ్మాయి ఇషా రెబ్బా మేక‌ప్ లెస్ ఫోజు వైర‌ల్
X
వ‌రంగ‌ల్ బ్యూటీ ఇషా రెబ్బా క్రేజ్ గురించి తెలిసిందే. ఈ భామ శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన‌ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో తెరంగేట్రం చేసింది. ద్వితీయ ప్ర‌య‌త్నం ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో `అంత‌కుముందు ఆ త‌రవాత`చిత్రంతో సోలో క‌థానాయిక‌గా స‌త్తా చాటింది. ఎన్టీఆర్ లాంటి స్టార్ తో క‌లిసి `అర‌వింద స‌మేత` చిత్రంలో కీల‌క పాత్ర పోషించిన ఇషా కెరీర్ ప‌రంగా వ‌రుస చిత్రాల‌తో బిజీ అయిపోయింది. ఓవైపు సోలో నాయిక‌గా అవ‌కాశాలు అందుకుంటూనే పెద్ద హీరోల సినిమాల్లో క్యారెక్ట‌ర్ల‌తో మెప్పిస్తోంది.

ఇటీవ‌లే పిట్ట‌క‌థ‌లు అనే వెబ్ సిరీస్ లోనూ న‌టించింది. ఈ సిరీస్ లో ఇషా పాత్ర‌కు పేరొచ్చింది. త్వ‌ర‌లో రిలీజ్ కి రానున్న అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ లోనూ ఇషా ఓ కీల‌క భూమిక‌ను పోషిస్తోంది. త‌మిళంలో ఆయిర‌మ్ జేన్మ‌గ‌ల్ అనే చిత్రంలోనూ ఇషా న‌టిస్తోంది.

ఓవైపు పెద్ద తెర‌పై క్రేజు కొన‌సాగుతుండగానే వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌తోనూ ఇషా బాగానే ఆర్జిస్తోంది. సోష‌ల్ మీడియాల్లో ఇషా నిరంత‌ర ఫోటో ట్రీట్ గురించి తెలిసిందే. ఇటీవ‌ల ఇషా వ‌రుస ఫోటోషూట్ల‌తో ఇన్ స్టా మాధ్య‌మంలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ క్ర‌మంలోనే ప‌లు కార్పొరెట్ బ్రాండ్లు త‌న‌వైపు క్యూ క‌ట్టాయి.

సామ్ సంగ్ మొబైల్స్.. పెపే లాంటి ప్ర‌ఖ్యాత బ్రాండ్ల‌కు ఇషారెబ్బా ఈ వేదిక‌ల‌పై ప్ర‌మోష‌న్ చేస్తున్నారు. ఇంత‌కుముందు పెపే ఇన్న‌ర్ దుస్తుల‌కు ప్ర‌చారం చేస్తూ జిమ్మింగ్ చేస్తున్న వీడియో యూత్ లో వైర‌ల్ అయ్యింది. అలాగే జూబ్లీహిల్స్ రిపీట్ బ్రూవ‌రీ ఫోటోషూట్ తో దుమారం రేపింది. తాజాగా మ‌రో హాట్ ఫోటోషూట్ తో ఇషా సంచ‌ల‌నంగా మారింది. ఈ ఫోటోషూట్ లో ఇషా మేక‌ప్ లెస్ రూపం ఎంతో ఆక‌ర్షిస్తోంది. శ‌య‌న‌మందిరంలో ఇషా వైట్ టాప్ మిడ్డీ డ్రెస్ లో క‌వ్విస్తున్న ఫోటోలు వైర‌ల్ గా మారాయి. త‌న‌దైన అందం ప్ర‌తిభ‌తో మెప్పిస్తున్న ఈ బ్యూటీ మునుముందు సౌత్ లో పెద్ద స్టార్ అవ్వాల‌ని క‌ల‌లు గంటోంది. అవి నెర‌వేరాల‌నే ఆశిద్దాం.