Begin typing your search above and press return to search.

ఒక ఇషా పోయి.. ఇంకో ఇషా వచ్చింది

By:  Tupaki Desk   |   5 Sept 2016 10:50 AM IST
ఒక ఇషా పోయి.. ఇంకో ఇషా వచ్చింది
X
మొత్తానికి ఇషా అనే పేరుతో ఉన్న హీరోయినే ఖాకీ డ్రెస్ వేయాలని చాలా స్ట్రాంగ్ గా ఫిక్సయిపోయినట్లున్నాడు డైరక్టర్ సుధీర్ వర్మ. మనోడు త్వరలోనే హీరో నిఖిల్ తో తీస్తున్న సినిమాలో.. మిస్ ఇండియా బ్యూటి ఈషా గుప్తా ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ రోల్ చేస్తుందని న్యూస్ రాగా.. అబ్బే నేను చేయట్లేదు అంటూ వగలు పోయింది ఈషా. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే..

గతంలో చంద్రలేఖ వంటి తెలుగు సినిమాల్లో మెరిసిన ఇషా కొప్పికర్ ఉంది చూశారూ.. ఈ 40 ఏళ్ళ బ్యూటీకి ఇప్పుడు హీరోయిన్ గా ఆఫర్లు రావంటే రావులే. అయితే అమ్మడు తెలుగులో ఇప్పుడు నిఖిల్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెరవనుందట. పైగా తనకు వచ్చిన హప్కిడో అనే కొరియన్ మార్షల్ ఆర్ట్ ను కూడా ఈ పాత్రలో చూపిస్తుందట ఇషా. మొత్తానికి ఈ పాత్రను చేయడానికి ఒక ఇషా మిస్సయినా.. మళ్ళీ మరో ఇషానే వచ్చిందనమాట. ట్విస్టేంటంటే.. ఈ ఇషా కొప్పికర్ కూడా 1995లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న సుందరే. మొత్తానికి మిస్ ఇండియా హాటీలనే ఈ రోల్ కు అనుకున్నారా ఏంటి?

ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా పెళ్ళి చూపులు సినిమాతో కొత్త స్టార్డమ్ ఎంజాయ్ చేస్తున్న రీతూ వర్మ నటిస్తోంది. సినిమాను అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు.