Begin typing your search above and press return to search.

ఆ క్రికెటర్ అందుకే టిక్ టాక్ చేస్తున్నాడా..?

By:  Tupaki Desk   |   12 May 2020 2:30 PM GMT
ఆ క్రికెటర్ అందుకే టిక్ టాక్ చేస్తున్నాడా..?
X
లాక్‌డౌన్ స‌మ‌యంలో అభిమానులకు, నెటిజన్లకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు క్రికెటర్లు డేవిడ్ వార్న‌ర్, కెవిన్ పీటర్సన్. ఈ మధ్య సెలబ్రిటీలు టిక్ టాక్ వీడియోలు చేయడం మాములే అయిపోయింది. తెలుగు సినిమాలకు సంబంధించిన సాంగ్స్‌, డైలాగ్స్‌తో ఎక్కువ టిక్ టాక్ వీడియోలు చేస్తూ వ‌స్తున్న ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్న‌ర్ తాజాగా 'అల వైకుంఠపురంలో' సినిమాలోని 'రాములో రాములా' పాటకు తన ఫ్యామిలీతో క‌లిసి టిక్ టాక్ వీడియో చేశారు. వార్నర్‌-కాండీస్‌ ముందు నిలబడి జంటగా అల్లు అర్జున్ రాములో సాంగ్ కి కాలుకదిపారు. వీరి వెనక వార్నర్ గారాలపట్టి ఇండిరే కూడా ఈ వీడియోలో పాల్గొని డాన్స్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో కూడా వైరల్‌ అవుతోంది. బుట్ట బొమ్మ, సన్నజాజి సాంగ్, పోకిరి డైలాగ్‌కి టిక్ టాక్ వీడియోలు సోష‌ల్ మీడియాలో దుమ్మురేపిన సంగతి తెలిసిందే.

అయితే వార్నర్ తో పాటు ఇంగ్లాండ్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కూడా ఇటీవలే కొంటెగాన్ని కట్టుకో సాంగ్ కి తనదైన హావభావాలతో ఇరగదీసి వైరల్ అయ్యారు. ఇలా క్రికెటర్లు సైతం తెలుగు పాటల పై, డైలాగ్స్ పై టిక్ టాక్స్ చేయడంతో అభిమానులలో కాస్త ఆసక్తి నెలకొంటుంది. వార్నర్ అయితే మొత్తం సన్ రైసర్స్ జెర్సీ ధరించి ప్రతిసారి అలరిస్తూ.. తనదైన స్టైల్ లో తనకు హైదరాబాద్ పై ఉన్న ప్రేమ, అభిమానాలను బయట పెడుతున్నాడు. ఈ మధ్య టిక్ టాక్ లో తెలుగు పాటలకు క్రేజ్ మాములుగా లేదు. తాజాగా వార్నర్ రాములో పాటతో ఫిదా చేసాడు. ఇక సన్ రైసర్స్ టీమ్ ట్విట్టర్లో వార్నర్ వీడియో పోస్ట్ చేసి.. 'వార్నర్ మళ్లీ వచ్చాడు కొత్త వీడియోతో.. లైక్ చేయండి వార్నర్ ఫ్యామిలీ పూర్తిగా హైదరాబాద్ కి షిఫ్ట్ అయితే బాగుండు అనుకుంటే..' అన్నట్లు పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చూస్తే వారు చెప్పింది నిజమేనేమో అనిపిస్తుంది. వార్నర్ ఏంటి తెలుగు పాటల మీద పడ్డాడు అనుకుంటే.. హైదరాబాద్ కి షిఫ్ట్ అయి ఇక్కడే సెటిల్ అవుదామని చూస్తున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి త్వరలో ఏదైనా కొత్త టిక్ టాక్ తో పాటు కొత్త కబురు చెబుతాడేమో..!