Begin typing your search above and press return to search.

పెద్ద నిర్మాత చేతిలో పడ్డ దాసు

By:  Tupaki Desk   |   11 March 2020 2:20 PM IST
పెద్ద నిర్మాత చేతిలో పడ్డ దాసు
X
వెళ్లి పోమాకే.. ఫలక్‌ నుమా దాస్‌ చిత్రాలతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడిగా మారిన విశ్వక్‌ సేన్‌ ఇటీవలే ‘హిట్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నాని నిర్మించిన హిట్‌ సినిమాతో విశ్వక్‌ సేన్‌ నటుడిగా మరోసారి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా విశ్వక్‌ సేన్‌ సినిమా సినిమాకు ఒక్కో మెట్టు చొప్పున ఎక్కుతూ వస్తున్నాడు. హిట్‌ తర్వాత స్టార్‌ నిర్మాత బ్యానర్‌ లో సినిమాను చేసేందుకు విశ్వక్‌ రెడీ అయ్యాడట.

సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం దిల్‌ రాజు నిర్మాణంలో విశ్వక్‌ సేన్‌ నాల్గవ చిత్రం తెరకెక్కబోతుందట. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ లో రూపొందబోతున్న విశ్వక్‌ సేన్‌ సినిమాతో నరేష్‌ కొప్పల్లి అనే దర్శకుడు పరిచయం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇంట్రెస్టింగ్‌ కథాంశం అవ్వడం వల్ల దిల్‌ రాజు నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ఈనెల 18న సినిమాకు ముహూర్తం కుదిరింది. పూజా కార్యక్రమాలు ఆ రోజున నిర్వహించి ఆ వెంటనే రెగ్యులర్‌ షూటింగ్‌ కు కూడా వెళ్లబోతున్నారట. దిల్‌ రాజుతో పాటు ఈ సినిమాకు బెక్కం వేణు గోపాల్‌ సహ నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. షూటింగ్‌ ప్రారంభోత్సవం రోజున హీరోయిన్‌ మరియు ఇతర టెక్నీషియన్స్‌ వివరాలను వెళ్లడిస్తారని తెలుస్తోంది.