Begin typing your search above and press return to search.

రౌడీ ప్లాన్ వ‌ర్క‌వుట్ అవుతుందా?

By:  Tupaki Desk   |   28 July 2022 9:30 AM GMT
రౌడీ ప్లాన్ వ‌ర్క‌వుట్ అవుతుందా?
X
రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ ఏడాది 'లైగ‌ర్‌'తో బాలీవుడ్ కు ప‌రిచ‌యం కాబోతున్న విష‌యం తెలిసిందే. వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్న ఈ మూవీని బాలీవుడ్ క్రేజీ ప్రొడ్యూస‌ర్ క‌ర‌ణ్ జోహార్ తో క‌లిసి పూరి, చార్మి అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ బాక్స‌ర్ మైక్ టైస‌న్ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టించిన ఈ మూవీ ఆగ‌స్టు 25న పాన్ ఇండియా వైడ్ గా ఐదు భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది. మూవీ రిలీజ్ దాదాపు నెల రోజులు వుండ‌టంతో ప్ర‌స్తుతం టీమ్ ప్ర‌మోష‌న్స్ ని స్పీడ‌ప్ చేసింది.

ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత విజ‌య్ దేవ‌ర‌కొండ బ్యాక్ టు బ్యాక్ రెండు క్రేజీ సినిమాల్లో న‌టిస్తున్నారు. ఇందులో ఒక‌టి 'ఖుషీ'. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీమేక‌ర్స్ నిర్మిస్తున్నారు.

క‌శ్మీర్ నేప‌థ్యంలో సాగే అంద‌మైన రొమాంటిక్ ల‌వ్ స్టోరీగా ఈ సినిమాని ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ తెర‌కెక్కిస్తున్నాడు. స‌మంత హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీని న‌వంబ‌ర్ లోపు ఎట్టిప‌రిస్థితుల్లోనూ పూర్తి చేయాల‌ట‌.

ఇందు కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌త్యేకంగా ఓ యాక్షన్ ప్లాన్ ని సిద్ధం చేసుకున్న‌ట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే కంటిన్యూగా ఈ మూవీ కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ డేట్స్ ఇచ్చేశార‌ట‌.

ఎలాంటి బ్రేక్ లేకుండా ఈ మూవీని అనుకున్న విధంగా అనుకున్న టైమ్ కి పూర్తి చేసి పూరి ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టాల‌నుకుంటున్నార‌ట‌. అయితే ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో షూటింగ్ ల బంద్ ఆగస్టు 1 నుంచి మొంద‌లు కానున్న నేప‌థ్యంలో రౌడీ ప్లాన్ వ‌ర్క‌వుట్ అవుతుందా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఈ మూవీ పూర్తి చేసిన వెంట‌నే విజ‌య్ దేవ‌ర‌కొండ వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్ప‌నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'జ‌న‌గ‌ణ‌మ‌న‌' షూటింగ్ కి వెళ్లనున్నారు. ఈ ఏడాది చివ‌ర‌లో ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ని ప్రారంభించ‌బోతున్నారు. ఇందు కోసమే విజ‌య్ 'ఖుషీ' మూవీ షూటింగ‌ట్ ని త్వ‌ర‌గా పూర్తి చేసుకోవాల‌ని ప్లాన్ చేసుకుంటున్నార‌ట‌. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.