Begin typing your search above and press return to search.

విజయ్'D కెరీర్ డేంజర్ జోన్ లోకి వెళ్లే ప్రమాదం ఉందా..?

By:  Tupaki Desk   |   1 Sep 2022 9:29 AM GMT
విజయ్D కెరీర్ డేంజర్ జోన్ లోకి వెళ్లే ప్రమాదం ఉందా..?
X
టాలీవుడ్ లో ఇటీవల కాలంలో ఎక్కువగా వినబడుతున్న పేరు విజయ్ దేవరకొండ. 'పెళ్లి చూపులు' సినిమాతో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రౌడీ స్టార్ VD.. 'అర్జున్ రెడ్డి' మూవీతో ఓవర్ నైట్ లోనే తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్నాడు. యూత్ లో భారీ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలో 'గీత గోవిదం' సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

సినిమాలతో కంటే రియల్ లైఫ్ యాటిట్యూడ్ తోనే విజయ్ దేవరకొండ ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్నారు. అర్జున్ రెడ్డి తరహాలోనే బయట కూడా ప్రవర్తిస్తూ టాలీవుడ్ లోనే కాదు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాడు. ఇక్కడిదాకా అంతా బాగానే ఉన్నా.. వీడీ మూవీ ప్రమోషన్స్ లో చేసే హడావిడికి.. సినిమా రిజల్ట్స్ కు అసలు పొంతన లేకుండా పోతోంది.

ఇటీవల 'లైగర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్.. పాన్ ఇండియా స్థాయిలో డిజాస్టర్ గా నిలిచింది. ప్రచార కార్యక్రమాలలో వీడీ ఈ సినిమాని ఓ రేంజ్ లో లేపాడు. తన సినిమా గురించి గొప్పలు చెప్పుకోవడంలో తప్పలేదు కానీ.. ఇండియా మొత్తం షేక్ అవుతుంది.. ఆగ్ లగా దేంగే.. అంటూ స్టేటమెంట్స్ ఇవ్వడమే కాస్త ఓవర్ గా అనిపించింది.

ఈ చిత్రానికి 200కోట్ల ఓటీటీ ఆఫర్ వచ్చిందంటే.. తన సినిమా అంతకుమించి చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు విజయ్. ఆగస్ట్ 25న థియేటర్లు బ్లాస్ట్ అవుతాయని అన్నాడు. ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడని అనిపించినప్పటికీ.. ఇదంతా సినిమాకు బజ్ క్రియేట్ చేసింది. విజయ్ దేవరకొండ 'లైగర్' చుట్టూ క్రియేట్ చేసిన బజ్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

తీరా 'లైగర్' రిలీజ్ అయ్యాక.. విజయ్ దేవరకొండ ఈ సినిమా గురించా ఇంతగా మాట్లాడింది అని అందరూ షాక్ అయ్యారు. ఇది సాధారణ ప్రేక్షకులతో పాటుగా ఫ్యాన్స్ ను కూడా తీవ్రంగా నిరాశ పరిచింది. ఫస్ట్ వీకెండ్ లో వసూళ్ళని బట్టి చూస్తే.. మేకర్స్ కు ఇది బిగ్గెస్ట్ లాస్ ప్రాజెక్ట్ గా మిగిలిపోతుందని అర్థమవుతుంది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన లైగర్.. బ్రేక్ ఈవెన్ మార్క్ కు చాలా దూరంలో ఆగిపోనుంది. పరిస్థితి చూస్తుంటే 65 కోట్ల వరకూ నష్టం వస్తుందని.. టాలీవుడ్ లో భారీ డిజాస్టర్స్ లిస్టులో ఈ సినిమా టాప్-5లో చోటు సంపాదించుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పాన్ ఇండియా స్టార్ గా మారాలని ఆశపడ్డ విజయ్ దేవరకొండ కు ఇది నిజంగా గట్టి ఎదురు దెబ్బ అని చెప్పాలి.

'లైగర్' సినిమా రిజల్ట్ విజయ్ దేవరకొండ ఓవర్ కాన్ఫిడెన్స్ ను దెబ్బ తీయడమే కాదు.. అతని స్క్రిప్ట్ సెలెక్షన్ మరియు జడ్జిమెంట్ ను ప్రశ్నార్థకంగా మార్చింది. అసలు విజయ్ ఇలాంటి పేలవమైన కంటెంట్ ను ఎలా యాక్సెప్ట్ చేసాడు.. దీంతో పాన్ ఇండియాని ఎలా షేక్ చేయాలి అనుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసే పరిస్థితి ఏర్పడింది.

నిజానికి గత కొన్నేళ్ల నుండి విజయ్ నటించిన సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. అతని కెరీర్ గ్రాఫ్ ను పరిశీలిస్తే హిట్స్ కంటే ప్లాప్స్ ఎక్కువగా కనిపిస్తాయి. 'పెళ్లి చూపులు' 'అర్జున్ రెడ్డి' 'గీత గోవిందం' వంటి మూడు మంచి హిట్లు.. 'టాక్సీవాలా' వంటి మోస్తరు విజయం మాత్రమే వీడీ కెరీర్ లో ఉన్నాయి. ఇవి కాకుండా చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు.

'నోటా' 'డియర్ కామ్రేడ్' 'వరల్డ్ ఫేమస్ లవర్' వంటి భారీ డిజాస్టర్స్ విజయ్ ఖాతాలో ఉన్నాయి. ఇప్పుడు 'లైగర్' మూవీ అంతకుమించిన పరాజయంగా నిలిచే అవకాశం ఉంది. అంటే విజయ్ దేవరకొండ తో సినిమా తీసి లాభపడిన వారి కంటే నష్టపోయిన వాళ్లే ఎక్కువమంది ఉన్నారని తెలుస్తోంది.

క్రేజ్ ను ఇమేజ్ ను ఉపయోగించుకునే క్రమంలో సరైన దారిలో వెళ్లకపోవడం వల్లనే విజయ్ కు ఇలాంటి ప్రతికూల ఫలితాలు వస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. స్క్రిప్ట్ సెలెక్షన్ సరిగా లేకపోవడం వల్లనే పరాజయాలు వస్తున్నాయని అంటున్నారు. అలానే విడుదలకు ముందు రౌడీ స్టార్ చూపించే 'అతి' విశ్వాసం కూడా దీనికి కారణంగా విశ్లేషిస్తున్నారు.

రీసెంట్ గా 'లైగర్' మరియు విజయ్ ను ఉద్దేశిస్తూ ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎగిరెగిరి పడితే ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయని.. దేశాన్ని తగలెడతాం.. ఊరిని తగలెడతాం అంటే మనల్ని తగలెడతారని ఆయన అన్నారు. నువ్వు చిటికెలు వేస్తే.. వాళ్ళు కూడా చిటికెలు వేస్తారని తమ్మారెడ్డి హితవు పలికారు.

ఒక్క తమ్మారెడ్డే కాదు.. 'లైగర్' ప్లాప్ తర్వాత సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ ను ఉద్దేశించి చాలా వరకు ఇలాంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటి నుంచైనా విజయ్ కథల ఎంపికలో జాగ్రత్త వహించాలని.. మిగతా విషయాలను పక్కనపెట్టి కంటెంట్ మీద దృష్టి పెట్టాలని నెటిజన్లు సూచిస్తున్నారు. అలా చేస్తే టాప్ హీరోల లీగ్ లో చేరడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు.

కానీ ఇవేమీ పట్టించుకోకుండా సినిమాల విషయంలో ఇలానే ఉంటే మాత్రం మున్ముందు మరిన్ని ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉందని.. డౌన్ ఫాల్ స్టార్ట్ అయి VD కెరీర్ డేంజర్ జోన్ లోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే రౌడీ ఫ్యాన్స్ మాత్రం 'ఖుషి' 'JGM' సినిమాలతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తాడని భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.