Begin typing your search above and press return to search.

వీర‌మ‌ల్లు 2024 ఎన్నిక‌లు ముందేనా?

By:  Tupaki Desk   |   12 Nov 2022 10:30 AM GMT
వీర‌మ‌ల్లు 2024 ఎన్నిక‌లు ముందేనా?
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో సోషియా ఫాంట‌సీ ఎంట‌ర్ టైన‌ర్ 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. కాంబో ప్ర‌క‌ట‌న‌తోనే అంచ‌నాలు ఆకాశ‌న్నంట‌డం మొదలైంది. సినిమా షూటింగ్ ప్రారంభ‌మై కొన్ని నెల‌లు గ‌డుస్తోంది. కానీ షూట్ ఎంత వ‌ర‌కూ పూర్త‌యింది అన్న‌ది ఇంత వ‌ర‌కూ అధికారిక ప్ర‌క‌ట‌న‌లేదు.

కేవ‌లం ఊహాగానాలు మాత్ర‌మే తెర‌పైకి వ‌స్తున్నాయి త‌ప్ప‌! షూట్ పై మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చింది లేదు. ఇక సినిమా రిలీజ్ 2023 సంక్రాంతి కానుగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావాల‌ని భావించారు. ప్రారంభ స‌మ‌యంలో ఓ తేదీ సైతం అనుకున్నారు. కానీ రిలీజ్ ఇప్పుడు సాధ్య‌ప‌డేలా లేద‌ని తాజా స‌మాచారం. షూట్ ఎంత వ‌ర‌కూ పూర్త‌యింది అన్న‌ది క్లారిటీ లేక‌పోవ‌డం స‌హా తాజా ప‌రిస్థితులు వీర‌మ‌ల్లుని రిలీజ్ విష‌యంలో మ‌రింత జాప్యం జ‌రిగేలా క‌నిపిస్తుంది.

కొన్ని రోజులుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌నాల్లోనే తిరుగ‌తున్న సంగ‌తి తెలిసిందే. ఏపీలో నెల‌కొన్ని రాజ‌కీయ వార్ నేప‌థ్యంలో పీకే ఆ ప్ర‌సంగాల్లోనే బిజీగా ఉంటున్నారు. హైద‌రాబాద్ టూ వైజాగ్ చ‌క్కర్లు కొడుతున్నారు. ఈ క్ర‌మంలో షూటింగ్ స‌క్ర‌మంగా జ‌ర‌గ‌డం లేదు. ప‌వ‌న్ డేట్లు కేటాయించిర‌న‌ప్పటికీ మ‌ధ్య‌లో మార్పులు రాడంతో ఆ డేట్ల‌లో షూటింగ్ జ‌ర‌గ‌లేదు.

ఆ త‌ర్వాత ప‌వ‌న్ కొత్త డేట్ల‌ను స‌వ్యంగా కేటాయించ‌లేద‌ని తెలుస్తోంది. అయినా ఈ గ్యాప్ లో క్రిష్ ఇత‌ర న‌టీత‌న‌టుల‌పై షూట్ పూర్తి చేసారు. ఇప్పుడు కేవ‌లం ప‌వ‌న్ పై షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉంద‌ని యూనిట్ వ‌ర్గాల స‌మాచారం. ఇదే విష‌యాన్ని ఇటీవ‌లే పీకే దృష్టికి తీసుకెళ్తే టీమ్ స‌భ్యుల‌పై సైతం సీరియ‌స్ అయిన‌ట్లు గుస గుస వినిపిస్తుంది.

ఖాళీ ఉంటే వ‌స్తాను..లేక‌పోతే రాను అన్న ధోర‌ణిలో పీకే మాట్లాడిన‌ట్లు ఫిలిం స‌ర్కిల్స్ లో చ‌ర్చ‌కొచ్చిస్తుంది. కొన్ని రోజులుగా ప‌వ‌న్ ఏపీలో యుద్ద వాతావ‌ర‌ణం నేప‌థ్యంలో మీడియా ముందు అసంతృప్తి..ఆగ్ర‌హ జ్వాల‌తో ర‌గిలిపోయిన వైనం తెలిసిందే. పీకే ఇంకా ఆ మోడ్ బ‌య‌ట‌కు రాలేద‌ని..ఆ కోపంలోనే టీమ్ పైనా అరిచి గ‌లాటా చేసిన‌ట్లు ఫిలిం సర్కిల్స్ లో చ‌ర్చ‌కొచ్చింది.

రానున్న రోజుల్లో పీకే మ‌రింత బీజీగా మారుతారు. రాజకీయంగా ఆ రోజుల‌న్ని కీల‌కంగా మార‌నున్నాయి. అప్పుడు ప‌సూర్తి స్థాయిలో జ‌నాల మ‌ధ్య‌లోనే ఉంటారు. ఇవ‌న్నీ చూస్తుంటే వీర‌మ‌ల్లు ఇప్ప‌ట్లో రిలీజ్ అయ్యే స‌న్నివేశం క‌నిపించ‌లేద‌ని తెలుస్తుంది. బ్యాలెన్స్ షూట్ కి పీకే డేట్లు కేటాయించి షూట్ పూర్తిచేసి..రిలీజ్ కి వ‌చ్చే స‌రికి 2024 ఎన్నిక‌లు కూడా స‌మీపిస్తాయ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ముందు జాగ్ర‌త్త‌గా క్రిష్ మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు పూర్తియిన భాగం వ‌ర‌కూ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తిచేస్తున్న‌ట్లు స‌మాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.