Begin typing your search above and press return to search.

'వకీల్ సాబ్' విడుదల ఆ రోజేనా..??

By:  Tupaki Desk   |   28 Dec 2020 7:45 AM GMT
వకీల్ సాబ్ విడుదల ఆ రోజేనా..??
X
మూడేళ్ళ రాజకీయాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్న సినిమా వకీల్ సాబ్. ఈ సినిమా పై పవర్ స్టార్ అభిమానుల అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. ప్రస్తుతం వకీల్ సాబ్ మేకర్స్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది విడుదల కావాల్సిన వకీల్ సాబ్ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పుడిప్పుడే మెల్లగా థియేటర్స్ ఓపెన్ అవుతుండటంతో త్వరలోనే వాయిదా పడిన సినిమాలన్నీ విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే వకీల్ సాబ్ రిలీజ్ ఎప్పుడు అనేది మాత్రం పవర్ స్టార్ ఫ్యాన్స్ లో జవాబు లేని ప్రశ్నగా వెంటాడుతోంది. ఈ ప్రశ్నకు మేకర్స్ ఓ తీపి కబురు వినిపిస్తారనే ఆశతో అభిమానులు ఎదురు చూస్తున్నారు.

అయితే ఆ ప్రశ్నకు సమాధానము ఏప్రిల్ నెలలోనే రాబోతుందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. హిందీ పింక్ మూవీ నుండి రీమేక్ అవుతున్న వకీల్ సాబ్ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను 2021 ఏప్రిల్ 9న సమ్మర్ కానుకగా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ నడుస్తుంది. మరి అదే రోజున విడుదల అవుతుందా.. లేక మేకర్స్ అంతకు ముందు వెనక రిలీజ్ చేస్తారా అనేది వాళ్ళ నుండే క్లారిటీ రావాల్సి ఉంది. థమన్ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే మోస్ట్ అవెయిటింగ్ ఫిల్మ్ గా వకీల్ సాబ్ సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేస్తోంది. ఆ బజ్ తగ్గక ముందే రిలీజ్ చేస్తే బాగుంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారట. అతిత్వరలో పవన్ కళ్యాణ్ తీపికబురు చెబుతారేమో చూడాలి!!