Begin typing your search above and press return to search.

మెగా హీరో డెబ్యూ ఫిలిం.. ఓటీటీ రిలీజ్?

By:  Tupaki Desk   |   16 May 2020 10:50 AM GMT
మెగా హీరో డెబ్యూ ఫిలిం.. ఓటీటీ రిలీజ్?
X
మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న కొత్త హీరో పంజా వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతపడడంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.. లేకపోతే ఈ పాటికే సినిమా రిలీజ్ అయి ఉండాలి.

సినిమా థియేటర్లు ఎప్పుడు తెరుస్తారు.. ఎప్పుడు ఈ సినిమా విడుదలకు అవకాశం వస్తుంది అనేదానిపై ఇప్పటివరకూ స్పష్టత రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఆహా లేదా అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట. కొత్త సినిమాలను డైరెక్ట్ గా ఓటీటీ రిలీజ్ చెయ్యడం అనే కొత్త కాన్సెప్టు కు ఇప్పుడిప్పుడే ఫిలిం మేకర్లు కూడా అలవాటు పడుతున్నారు. అయితే ఇలా డెబ్యూ హీరో సినిమాను ఓటీటీ రిలీజ్ చెయ్యడం మాత్రం కొత్త విషయమే.

ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర పోషించాడు కాబట్టి ఓటీటీలో రిలీజ్ అయితే తమిళ ప్రేక్షకుల నుండి కూడా ఈ సినిమాకు మంచి స్పందన దక్కే అవకాశం ఉంది. త్వరలోనే ఈ విషయంపై ఒక ప్రకటన రావొచ్చని అంటున్నారు.