Begin typing your search above and press return to search.
విజయ్ బ్యానర్ లో కరణ్ పెట్టుబడులు..?
By: Tupaki Desk | 28 May 2021 8:00 AM ISTసెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు ''లైగర్'' అనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పూరీ కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరీ జగన్నాథ్ - ఛార్మీ కౌర్ - కరణ్ జోహార్ కలిసి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇదిలావుంటే విజయ్ దేవరకొండ ఓ వైపు హీరోగా నటిస్తూనే.. నిర్మాతగా సినిమాలు రూపొందిస్తున్నాడు. కింగ్ ఆఫ్ ది హిల్ అనే ప్రొడక్షన్ హౌస్ ని ఏర్పాటు చేసిన వీడీ.. 'మీకు మాత్రమే చెప్తా' అనే సినిమా నిర్మించాడు. ఈ క్రమంలో ప్రస్తుతం తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా 'పుష్పక విమానం' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇలా సొంత బ్యానర్ పెట్టి తెలుగులో చిన్న సినిమాలు నిర్మిస్తూ వస్తున్న విజయ్ కు.. ఇప్పుడు బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సపోర్ట్ గా నిలవనున్నాడని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం 'లైగర్' సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న కరణ్ జోహార్.. విజయ్ నిర్మించే చిత్రాలకు బ్యాక్ ఎండ్ ఫైనాన్స్ చేయబోతున్నాడట. కింగ్ ఆఫ్ ది హిల్ బ్యానర్ లో పెట్టుబడి పెట్టడానికి కరణ్ ఫిక్స్ ఫిలిం సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. ఇదే గనుక నిజమైతే మాత్రం విజయ్ దేవరకొండ తెలుగులో నిర్మాతగా కూడా భారీ సినిమాలు తీసే అవకాశం ఉంది. ఇందులో నిజమెంతో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.