Begin typing your search above and press return to search.

ఆ కొత్త సినిమా కథ కొనసాగింపు మాత్రమేనా..?

By:  Tupaki Desk   |   13 April 2020 1:00 PM GMT
ఆ కొత్త సినిమా కథ కొనసాగింపు మాత్రమేనా..?
X
ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం అనిల్ రావిపూడి మాత్రమే. పటాస్ సినిమా మొదలుకొని సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2, లతో పాటు రీసెంట్ గా సంక్రాంతి బరిలో 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అటు మాస్ ఇటు క్లాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులకు కూడా అనిల్ రావిపూడి సినిమాలు నచ్చుతున్నాయి. తన ప్రతి సినిమాలో కామెడీ ప్రధానంగా తెరకెక్కిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్న అనిల్. ఇటీవలే మరో సినిమా కథను తయారుచేయడం లో లీనమయ్యాడట.

గతేడాది విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ లను హీరోలుగా.. తమన్నా, మెహరీన్ లను హీరోయిన్లుగా పెట్టి రూపొందించిన చిత్రం 'ఎఫ్2'. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంటూ సంక్రాంతి బరిలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని అప్పుడే ప్రకటించాడు. ప్రస్తుతం కరోనా మూలంగా ఇంటి దగ్గరే ఉండి తన రైటింగ్ టీమ్ తో కలిసి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట. అయితే తను ప్రస్తుతం రాస్తున్న స్క్రిప్ట్ 'ఎఫ్3' మూవీదేనని సమాచారం. అంతేగాక ఎఫ్3 సినిమా కథ గురించి నెట్టింట్లో ఒక వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే ఎఫ్2 లో వెంకటేష్, వరుణ్ ల ఫ్రస్ట్రేషన్ మరింత పొడిగించనున్నట్లు సమాచారం. చూడాలి మరి ఎఫ్3 కథ అదేనా కాదా.. అనేది. వేచి చూడాల్సిందే అంటున్నారు.