Begin typing your search above and press return to search.

ఆ కాంబో మ‌ళ్లీ రిపీట్ అవ్వడానికి అస‌లు కారణం ఇదా..?

By:  Tupaki Desk   |   27 Jun 2021 9:30 AM GMT
ఆ కాంబో మ‌ళ్లీ రిపీట్ అవ్వడానికి అస‌లు కారణం ఇదా..?
X
వైవిధ్యమైన సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఒక టాలీవుడ్ దర్శకుడు.. ఇటీవల ఓ యువ హీరోని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. సరైన టైమ్ లో విడుదల కావడంతో ఈ ప్రాజెక్ట్ మీద పెట్టిన పెట్టుబడి అంతా వెనక్కి వచ్చేసింది. ఈ క్రమంలో డైరెక్టర్ - హీరో కలిసి మరో సినిమాని ప్రకటించారు.

ఇది కూడా కొత్త తరహా సినిమా అని తెలుస్తోంది. అయితే ఓ హిట్ కొట్టిన తర్వాత వెంటనే మళ్ళీ వీరిద్దరి కాంబోలో సినిమా ప్రారంభించడం గుర్తింపు సినీ వర్గాల్లో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ రిపీట్ అవ్వడానికి అసలు రీజ‌న్ హీరోనే ఈ సినిమాకి ఫైనాన్స్ తెచ్చుకోవడమేనని అనుకుంటున్నారు.

యువ హీరోకి ఇంట్లోనే ఫైనాన్స్ బ్యాకింగ్ ఉందట. ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కావడంతో.. క‌థ బాగుంటే త‌న సొంత వాళ్ల‌తోనే కుర్ర హీరో పెట్టుబ‌డి పెట్టిస్తున్నాడట. వీరి కాంబోలో వచ్చిన ఫస్ట్ సినిమాకు కూడా హీరోనే ఫైనాన్స్ తెచ్చుకున్నాడని టాక్ ఉంది. మొదటి సినిమా సక్సెస్ అయిందనే నమ్మకంతో ఈ క్రమంలో ఇప్పుడు ఇంకో సినిమాకి డబ్బులు పెట్టడానికి రెడీ అయ్యాడట.

ఇక డైరెక్టర్ విషయానికొస్తే, కొత్త జోనర్ సినిమాలతో హిట్స్ కొడుతున్నా.. స్టార్ హీరోలు అతనితో సినిమాలు చేయడానికి జంకుతున్నారట. ఈ క్రమంలో ఆల్రెడీ ఒక సినిమా చేసిన యంగ్ హీరోతోనే సరికొత్త కథాంశంతో మరో ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించినట్లు ఫిలిం సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.