Begin typing your search above and press return to search.

బుచ్చిబాబు మూవీలో ఎన్టీఆర్ క్యారెక్ట‌ర్ ఇదేనా?

By:  Tupaki Desk   |   2 Feb 2022 2:30 AM GMT
బుచ్చిబాబు మూవీలో ఎన్టీఆర్ క్యారెక్ట‌ర్ ఇదేనా?
X
రాజ‌మౌళి `ఆర్ ఆర్ ఆర్‌` త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. దీంతో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ త‌మ త‌దుప‌రి చిత్రాల‌కు సిద్ధ‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ .. శంక‌ర్ సినిమా ప‌నుల్లో బిజీ అయిపోగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా త‌న నెక్స్ట్ మూవీ ప‌నుల్లో మునిగిపోయారు. `ఆర్ ఆర్ ఆర్‌` త‌రువాత రెండు చిత్రాల‌ని ప‌ట్టాలెక్కించాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న ఎన్టీఆర్ ప‌నిలో ప‌నిగా `ఉప్పెన‌` ఫేమ్ బుచ్చిబాబు సానాతో ఓ సినిమా చేయ‌బోతున్నాడు.

ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన వార్త‌లు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వార్త బ‌య‌టికి వ‌చ్చేసింది. స్పోర్ట్స్ డ్రామాగా రూపొంద‌నున్న ఈ మూవీలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌బ‌డ్డీ ప్లేయ‌ర్ గా క‌నిపించ‌బోతున్నార‌ని, ఈ చిత్రం ప్ర‌ధానంగా గ్రామీణ నేప‌థ్యంలో సాగుతుంద‌ని తెలిసింది. గ్రామీణ నేప‌థ్యంలో సాగే ఎమోష‌న‌ల్ డ్రామాగా ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు తెర‌పైకి తీసుకురాబోతున్నారు.

`ఉప్పెన‌` త‌రువాత ఎన్టీఆర్ కు లైన్ వినిపించిన బుచ్చిబాబు.. ఆయ‌న నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డంతో ప్ర‌స్తుతం ఈ చిత్ర క‌థ‌ని పూర్తి చేసే ప‌నిలో ప‌డ్డారు. త్వ‌ర‌లోనే ఫైన‌ల్ స్క్రిప్ట్ ని పూర్తి చేసి ఈ చిత్రాన్ని తెర‌పైకి తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. కొర‌టాల శివతో ఎన్టీఆర్ ఓ భారీ సినిమా చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. నంద‌మూరి క‌ల్యాణ్ రామ్, సుధాక‌ర్ మిక్కిలినేని ఈ మూవీని నిర్మించ‌య‌బోతున్నారు.

త్వ‌ర‌లో సెట్స్ పైకి రానున్న ఈ మూవీ త‌రువాతే ఎన్టీఆర్ .. బుచ్చిబాబు సాన చిత్రాన్ని ప‌ట్టాలెక్కిస్తార‌ట‌. అత్యంత భారీ స్థాయిలో తెర‌పైకి రానున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌బోతున్నారు. మార్చిలో కొర‌టాల శివ - ఎన్టీఆర్ ల సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. దీని త‌రువాతే సానా బుచ్చిబాబు ఫిల్మ్ ప‌ట్టాలెక్క‌నుంది. `ఆర్ ఆర్ ఆర్‌` మార్చి 25న విడుద‌ల కాబోతున్న విష‌యం తెలిసిందే