Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ - మారుతి మూవీ బ్యాక్ డ్రాప్ ఇదేనా?

By:  Tupaki Desk   |   9 July 2022 2:30 AM GMT
ప్ర‌భాస్ - మారుతి మూవీ బ్యాక్ డ్రాప్ ఇదేనా?
X
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తో డైరెక్ట‌ర్ మారుతి ఓ భారీ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ని చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీకి `రాజా డీల‌క్స్‌` అనే టైటిల్ ని కూడా ఫైన‌ల్ చేసిన‌ట్టుగా గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు షికారు చేస్తున్నాయి.

అయితే ఈ ప్రాజెక్ట్ వుంటుందా? .. నిజంగానే ప్ర‌భాస్ .. మారుతిలో క‌లిసి ఆ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ని చేయ‌బోతున్నారా?.. గోపీచంద్ తో మారుతి రూపొందించిన `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`ఆశించిన ఫ‌లితాన్ని రాబ‌ట్ట‌ని నేప‌థ్యంలో ప్ర‌భాస్ ప్రాజెక్ట్ వుంటుందా? అంటే ప‌లు ర‌కాలు క‌థ‌నాలు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

ఫ్యాన్స్ కూడా ఈ స‌మ‌యంలో మారుతితో ప్ర‌యోగం అవ‌స‌ర‌మా అంటూ ప్ర‌భాస్ ఫ్యాన్స్ నెట్టింట కామెంట్ లు చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్ట్ ల మ‌ధ్య మారుతితో సినిమా చేయ‌డం పెద్ద సాహ‌స‌మే అవుతుంద‌ని అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌భాస్ ని కోరుతున్నారు. ఇదిలా వుంటే ఈ కామెంట్ ల‌ని ప‌క్క‌న పెట్టి ప్ర‌భాస్ - మారుతి ప్రాజెక్ట్ కి మేక‌ర్స్ శ్రీ‌కారం చుట్ట‌బోతున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ద‌స‌రా రోజున ఈ ప్రాజెక్ట్ ని అఫీషియ‌ల్ గా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించ‌డానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇదొక హార‌ర్ కామెడీ థ్రిల్ల‌ర్ అని, సినిమా అంతా ఓ బంగ్లా నేప‌థ్యంలో సాగుతుందని సినిమాకు సంబందించిన నేప‌థ్యం ఇదే అంటూ ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త తాజాగా బ‌య‌టికి వ‌చ్చింది. అయితే ఓ థియేట‌ర్ నేప‌థ్యంలో సాగే థ్రిల్ల‌ర్ గా ఈ చిత్ర క‌థ‌ని మ‌లిచారట‌. ఆ థియేట‌ర్ పేరే రాజా డీల‌క్స్‌. అందుకే ఈ మూవీకి `రాజా డీల‌క్స్ అనే టైటిల్ ని ఫైన‌ల్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది.

ఇందు కోసం ఓ థియేట‌ర్ సెట్ ని భారీ స్థాయిలో నిర్మించ‌బోతున్నార‌ట‌. అందులోనే సినిమా ప్ర‌ధాన క‌థ‌మొత్తం సాగుతుంద‌ని, ఎంటైర్ షూటింగ్ మొత్తం రెండు షెడ్యూళ్ల‌లో పూర్తి చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని ఇన్ సైడ్ టాక్‌. ఇక ఇందులో ప్ర‌భాస్ కు జోడీగా అనుష్క‌, మాళ‌విక మోహ‌న‌న్ న‌టించ‌బోతున్నారు. ఇప్ప‌టికే వీరిద్ద‌రిని ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలిసింది. మిగ‌తా న‌టీన‌టుల‌కు సంబంధించిన ఎంపికని కూడా మొద‌లు పెట్టార‌ట‌.

ప్ర‌భాస్ తో సినిమా కావ‌డంతో మారుతి తొలిసారి ఎక్కువ మంది రైట‌ర్ల‌తో ఈ స్క్రిస్ట్ వ‌ర్క్ చేస్తున్నార‌ని, అనుభ‌వ‌జ్ఞ‌లైన రైట‌ర్స్ తో తుది మెరుగులు దిద్దిస్తున్నార‌ని తెలుస్తోంది. ఇందు కోసం ఎక్కువ స‌మ‌యం కావాల‌ని మారుతి ఇటీవ‌ల ప్ర‌భాస్ ని క‌లిసి రిక్వెస్ట్ చేశార‌ట‌. ప్ర‌భాస్ కూడా ఇందుకు ఓకే చెప్పిన‌ట్టుగా చెబుతున్నారు. డీవీవీ దాన‌య్య అత్యంత భారీ స్థాయిలో నిర్మించ‌నున్న ఈమూవీ వ‌చ్చే ఏడాది రిలీజ్ కానుంద‌ని తెలిసింది.