Begin typing your search above and press return to search.

#BIGGBOSS5TELUGU : షణ్ముఖ్‌ గేమ్‌ ప్లాన్‌ ఇదేనా?

By:  Tupaki Desk   |   9 Sep 2021 12:30 PM GMT
#BIGGBOSS5TELUGU : షణ్ముఖ్‌ గేమ్‌ ప్లాన్‌ ఇదేనా?
X
బిగ్ బాస్ సీజన్‌ 5 లో ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్స్ గురించి ఎక్కువగా ప్రచారం జరిగింది. వారు ఉంటే ఖచ్చితంగా మరో రేంజ్ లో ఎంటర్ టైన్ మెంట్‌ ఉంటుందని అంతా భావించారు. అందులో యూట్యూబర్ షణ్ముఖ్‌ జశ్వంత్ ఒకరు. ఈయన అత్యధిక రెమ్యూనరేషన్ తో హౌస్‌ లో అడుగు పెట్టబోతున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. దాదాపుగా కోటి రూపాయలను ఈయన డిమాండ్ చేశాడు అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా ఆయన ఎంట్రీ గురించి సోషల్‌ మీడియాలో చర్చించుకోవడం జరిగింది. అంతటి పాపులారిటీని దక్కించుకున్న షణ్ముఖ్‌ జశ్వంత్ అంతా భావించినట్లుగానే సీజన్‌ 5 లో ఎంట్రీ ఇచ్చాడు. ఆయన్ను అభిమానించే వారు చాలా సంతోషించారు. ముఖ్యంగా అమ్మాయిల్లో యూత్‌ ఆడియన్స్‌ లో షణ్ముఖ్‌ కు మంచి ఫాలోయింగ్‌ ఉంది. వారంత కూడా ఇప్పుడు షణ్ముఖ్‌ ను ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ సమయంలో వెదుక్కోవాల్సి వస్తుంది అనేది టాక్.

షణ్ముఖ్‌ సోమవారం నుండి బుదవారం వరకు టెలికాస్ట్‌ అయిన మూడు ఎపిసోడ్స్‌ లో కనిపించింది చాలా తక్కువ. ఆయన్ను బిగ్ బాస్ ఎడిటర్ పట్టించుకోవడం లేదా అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తుంటే.. షణ్ముఖ్‌ ఎందుకు బిడియంగా ఉంటున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్‌ బాస్ లో యాక్టివ్ గా ఉన్న వారికి మాత్రమే మంచి గుర్తింపు ఉంటుంది.. అలాగే ముందు ముందు వారికి మంచి ఓట్లు దక్కే అవకాశం ఉంటుంది. అయితే షణ్ముఖ్‌ గేమ్‌ చూస్తుంటే కొందరికి అనుమానం కూడా కలుగుతోంది. తన సహజ పద్దతిలో షణ్ముఖ్‌ ఉండాలనుకోవడం మంచిదే. అతడు ఈ సమయంలో హడావుడి చేసి తప్పు చేయకుండా తనలా తాను ఉంటూ తన గేమ్‌ ఆడుతున్నాడు. తన అవసరం వచ్చిన సమయంలో ఫిజికల్‌ టాస్క్ సమయంలో ఖచ్చితంగా షణ్ముఖ్‌ తన సత్తా చాటుతాడు అనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.

బిగ్ బాస్‌ సీజన్ 5 లో ఇప్పుడు కాకున్నా ముందు ముందు షణ్ముఖ్‌ స్పెషల్‌ అట్రాక్షన్ గా నిలుస్తాడు అనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు. బిగ్‌ బాస్‌ గత సీజన్‌ లు చూస్తే మొదట్లో సైలెంట్‌ గా ఉన్న వారు చివరి వరకు నిలిచారు. కొందరు విజేతలుగా నిలిచారు. కనుక ఇప్పటి నుండే షణ్ముఖ్‌ హడావుడి చేయాలని భావించడం లేదు. అది అతడి గేమ్‌ ప్లాన్ గా చూస్తున్నారు. షణ్ముఖ్‌ గేమ్‌ ప్లాన్ అయితే పర్వాలేదు కాని అతడు అక్కడ ఉండలేక ఇబ్బంది పడుతున్నాడా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు ఆయన ప్రియురాలు మాజీ బిగ్‌ బాస్ కంటెస్టెంట్‌ దీప్తి సునైన షణ్ముఖ్ కు తన ఫుల్‌ సపోర్ట్‌ ను సోషల్‌ మీడియా ద్వారా చూపిస్తూ ఉంది. ఐ లవ్‌ యూ షణ్ను.. బిగ్ బాస్‌ ఎడిటర్ బ్రో మా వాడిని కాస్త కనిపెట్టు అంటూ ఫన్నీగా కామెంట్‌ పెట్టింది. మొత్తానికి షణ్ముఖ్‌ యాక్టివ్‌ అవ్వడం కోసం ఎదురు చూస్తున్న వారి కోసం అయినా ఆయన యాక్టివ్ అవుతాడేమో చూడాలి. ఇంకా కొందరు కూడా తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు. వారు అంతా కూడా హడావుడి చేసేందుకు బిగ్‌ బాస్ ఏదో ఒక టాస్క్ ఇచ్చే అవకాశం ఉంది.