Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్ : కొత్తగా పెళ్లైన వారు ఇలా ఉంటారా?

By:  Tupaki Desk   |   15 July 2021 7:00 AM IST
పిక్‌ టాక్ : కొత్తగా పెళ్లైన వారు ఇలా ఉంటారా?
X
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి జరిగి కనీసం ఏడాది కూడా కాలేదు. గత ఏడాది అక్టోబర్‌ నెలలో కాజల్‌ మరియు కిచ్లు లు పెళ్లి బంధంతో ఏకం అయ్యారు. వీరిద్దరు పెళ్లి అయిన తర్వాత హనీమూన్‌ కు మాల్దీవులకు వెళ్లారు. అక్కడ చాలా ఎంజాయ్‌ చేసినట్లుగా ఫొటోలు మరియు వీడియోలను షేర్‌ చేశారు. ఆ తర్వాత భార్య భర్తలు ఇద్దరు ఎక్కువగా కనిపించింది లేదు. ఇద్దరు కూడా బిజీ బిజీగా ఉండటం వల్ల ఎక్కువ సమయం కలిసి ఉండటం లేదు అనే కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. కరోనా టైమ్ అయినా కూడా ఇద్దరు ఎవరి పని వారు అన్నట్లుగా బిజీగా ఉంటున్నారు.

కొత్తగా పెళ్లి అయిన సెలబ్రెటీలు కనీసం ఏడాది పాటు ఫుల్‌ ఎంజాయ్ మూడ్‌ లో ఉంటారు. కాని చందమామ కాజల్‌ అగర్వాల్‌ మాత్రం అలా కనిపించడం లేదు. ఇద్దరు కూడా ఏదో ఒక పనిలో బిజీగా ఉంటున్నట్లుగా నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నట్లుగానే తాజా ఫొటో చూస్తుంటే వారు కొత్తగా పెళ్లి అయిన వారు ఉన్నట్లుగా లేరు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఫొటోలో కాజల్‌ సీరియస్ గా బుక్‌ చదువుతూ.. కిచ్లు ల్యాప్‌ టాప్ లో బిజీగా వర్క్‌ ఏదో చేస్తున్నట్లుగా ఉన్నారు. పెళ్లి అయ్యి ఏడాది కూడా కాకుండానే ఇంతగా ఎవరి పనిలో వారు బిజీ అయితే ఎలా అంటూ కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

కాజల్‌ పెళ్లి తర్వాత హీరోయిన్‌ గా బిజీగానే కంటిన్యూ అవుతోంది. ఒక వైపు ఆచార్య సినిమాలో హీరోయిన్ గా నటించిన కాజల్ ఇటీవలే నాగార్జున నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌ గా ఆఫర్‌ దక్కించుకుంది. వెబ్‌ సిరీస్ లు ఇతర భాషల సినిమాలు ఇలా కాజల్‌ బిజీ బిజీగా గడిపేస్తూ ఉంది. కొత్తగా పెళ్లి అయినా కూడా వరుస సినిమాలు చేయడంతో పాటు సమయం దొరికినప్పుడు ఇలా బుక్ చదుకుంటూ బిజీ గా ఉంటే ఎంజాయ్‌ ఎప్పుడు చేస్తారంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.