Begin typing your search above and press return to search.

బార్బీనే ప్రాణం పోసుకుని ఇలా న‌డిచొస్తుందా?

By:  Tupaki Desk   |   14 March 2021 6:19 AM GMT
బార్బీనే ప్రాణం పోసుకుని ఇలా న‌డిచొస్తుందా?
X
బార్బీ బొమ్మా? అమ్మో బొమ్మా?.. న‌గ‌రంలో జ‌నాల సందేహ‌మిది. చూస్తుంటే అచ్చు గుద్దిన‌ట్టు బార్బీనే త‌ల‌పిస్తోంది.. ఎవ‌రీ భామ‌! అంటూ యూత్ ఒక‌టే ఫిదా అయిపోతున్నారు అన‌న్య పాండేని ఇలా చూశాక‌. ప‌బ్లిక్ లో ఫోటోల‌కు ఫోజులిస్తున్న ఈ భామను చూడ‌గానే అస‌లు బార్బీనే ప్రాణం పోసుకుని ఇలా న‌డిచొస్తుందా? అన్నంత‌గా షాక్ తిన్నారు.

ఫోటోగ్రాఫ‌ర్లు అన‌న్య‌ను పిలుస్తూ స్నాప్ లు లాగేస్తుంటే అలా హాయ్ చెబుతూ నించున్న ఫోజు కూడా బార్బీ నే త‌ల‌పించింది. ఏ భంగిమ‌లో చూసినా అచ్చం బొమ్మ‌నే త‌ల‌పిస్తోంది. అంత‌గా అద్భుత వేష‌ధార‌ణ‌తో క‌నిపించింది అన‌న్య‌. ఓవైపు ఫోటోగ్రాఫ‌ర్లు కూడా ఆ లుక్ కి ఫిదా అయిపోయి త‌న‌ని బార్బీ అంటూ ఆట‌పట్టిస్తుండ‌డం క‌నిపిస్తోంది.

బ్లూ అండ్ వైట్ కాంబినేష‌న్ మిడ్డీ డ్రెస్ టాప్ తో అన‌న్య అద‌ర‌గొట్టింది. ఇక ఇదే రేంజులో క‌వ్విస్తూ రౌడీ బోయ్స్ కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌కుండా చేస్తున్న ఈ బ్యూటీ లైగ‌ర్ లో ఎలాంటి పాత్ర‌లో న‌టించ‌నుందో చూడాలి. స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ చిత్రంతో ఈ ర‌బ్బ‌రు బొమ్మ‌ను క‌ర‌ణ్ జోహార్ బాలీవుడ్ కి ప‌రిచ‌యం చేసిన సంగ‌తి తెలిసిందే. వ‌రుస సినిమాల‌తో కెరీర్ ప‌రంగా ఫుల్ బిజీగా ఉంది. లైగ‌ర్ తో సౌత్ లోనూ ఈ అందాల‌ బార్బీ అడుగుపెడుతోంది.