Begin typing your search above and press return to search.

ప్రీప్లాన్ బావుంది కానీ.. ఇది స‌రిపోతుందా!

By:  Tupaki Desk   |   23 Dec 2019 12:58 PM GMT
ప్రీప్లాన్ బావుంది కానీ.. ఇది స‌రిపోతుందా!
X
యంగ్ హీరో రాజ్ త‌రుణ్ స‌క్సెస్ చూసి చాలా కాల‌మ‌వుతోంది. అంధ‌గాడు త‌ర్వాత న‌టించిన నాలుగు సినిమాలు ఆశించిన ఫ‌లితానివ్వ‌లేదు. ప్ర‌స్తుతం చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా ఇద్దరిలోకం ఒక‌టే. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించి క్రిస్మ‌స్ కానుక‌గా ఈనెల 25న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో యూనిట్ పెద్ద ఎత్తున ప్ర‌చారం నిర్వ‌హిస్తోంది. ఇది పూర్తిగా యూత్ ని దృష్టిలో పెట్టుకుని తెర‌కెక్కించిన ల‌వ్ స్టోరీ కావ‌డంతో దిల్ రాజు -రాజ్ త‌రుణ్ కాలేజీ కుర్రాళ్ల‌ను టార్గెట్ చేసారు. య‌వ‌తరంలోకి సినిమాను తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కాలేజీల‌న్నింటిని చుట్టేస్తున్నారు. నిన్న హైదారాబాద్ లోని ఓ కాలేజ్ స్టూడెంట్స్ కు ఉచితంగా సినిమా చూపించాడు. అనంత‌ర వాళ్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. విద్యార్ధులంతా మ‌న‌సుకు హ‌త్తుకున్న స్టోరీ అంటూ ఆకాశానికి ఎత్తేసారు. ఓ విద్యార్ధి అయితే సినిమాని చ‌క్క‌గా విశ్లేషించాడ‌ని రాజుగారు తెగ‌ పొగిడారు. ఆ కుర్రాడిని చూస్తే ఆ వ‌య‌సులో త‌నకున్న సినిమా ఫ్యాష‌న్ గుర్తు చేసాడ‌ని ప్ర‌శంసించారు. ఆ కుర్రాడు క‌చ్చితంగా డిగ్రీ పూర్తి చేసి ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చి త‌న‌కి క‌నిపిస్తాడ‌ని.. అప్పుడు త‌ప్ప‌కుండా ఆ కుర్రాడి తో ప‌నిచేస్తాన‌ని దిల్ రాజు సంతోషం వ్య‌క్తం చేసారు.

అలాగే ఈరోజు నెల్లూరు కాలీజ్ విద్యార్థుల‌కు.. మంగ‌ళ‌వారం వైజాగ్ కాలేజ్ స్టూడెంట్ల‌కు సినిమా చూపించ‌నున్నారుట‌. దిల్ రాజు చేస్తోన్న‌ది తెలివైన ప‌నే. ఏ సినిమాకైనా మౌత్ టాక్ ముఖ్యం. ఆ టాక్ పాజిటివ్ గా ఉంటే ఖ‌ర్చు లేకుండా సినిమా జ‌నాల్లోకి వెళ్లిపోతుంది. స్టార్ డ‌మ్ తో ప‌నిలేకుండా సినిమాలు ఆడేస్తుంటాయి. నిర్మాత సురేష్ బాబు ఇదే లాజిక్ తో చిన్న సినిమాలు కొనుగోలు చేసి ప్రీవ్యూలు వేసి సినిమాపై న‌మ్మ‌కాన్ని పెంచి మార్కెట్ చేస్తున్నారు. పెళ్లి చూపులు-కేరాఫ్ కంచ‌ర‌పాలం సినిమాలు అలా స‌క్స‌స్ అయిన‌వే. ప్రీప్లాన్ బావున్నా.. సినిమాలో కంటెంట్ ఉంటేనే ఆశించ‌న‌ది ద‌క్కుతుంద‌ని అనుభ‌వాలు చెబుతున్నాయి.