Begin typing your search above and press return to search.

ఇది 'ఇస్మార్ట్ శంకర్' రీమేక కాదా..?

By:  Tupaki Desk   |   27 July 2022 12:30 AM GMT
ఇది ఇస్మార్ట్ శంకర్ రీమేక కాదా..?
X
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం మన స్టార్ హీరోలు దర్శకులు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బడ్జెట్ సినిమాలు పాన్ ఇండియా సినిమాలకు బాలీవుడ్ లో మంచి డిమాండ్ అయితే ఏర్పడింది.

ఇక గతంలో కంటే ఇప్పుడు బాలీవుడ్ టాలీవుడ్ పైనే కాస్త ఎక్కువగా ఫోకస్ చేసింది అని చెప్పవచ్చు. నిర్మాత కరణ్ జోహార్ కూడా తెలుగు దర్శకులతో సినిమాలు చేసేందుకు కాస్తా ఎక్కువగానే ఆసక్తి చూపిస్తున్నారు. లైగర్ సినిమాను పూరి తో కలిసి కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

లైగర్ సినిమాతో పూరి జగన్నాథ్ కూడా కరణ్ జోహార్ కు చాలా దగ్గరయిపోయారు. ఇక రీసెంట్ గా విడుదలైన ఒక సినిమా టీజర్ ను చూస్తూ ఉంటే కరణ్ జోహార్ పూరి ఇస్మార్ట్ శంకర్ సినిమాను రీమేక్ చేసినట్లుగా తెలుస్తోంది.
టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో 'స్క్రూ ధీలా' టైటిల్ టీజర్ విడుదలైంది. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ లో టైగర్ అమాయకుడిగా కనిపించాడు

ఇక కిడ్నాప్ చేయబడిన మహిళ గురించి విన్న తర్వాత అతను ప్రతిస్పందించి విలన్‌లను చంపేస్తాడు. టైటిల్, టైగర్ యొక్క వైవిధ్యమైన క్యారెక్టరైజేషన్ సన్నివేశాన్ని బట్టి చూస్తే, ఈ చిత్రం తెలుగు చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'కి రీమేక్ తప్ప మరొకటి కాదని అనిపిస్తుంది. అఫీషియల్ ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు గాని ఈ సినిమా కథను మేకింగ్ మార్చేసి 'స్క్రూ ధీలా' సినిమాగా రూపొందించారని తెలుస్తోంది.

అసలైతే గతంలోనే చాలామంది ఇస్మార్ట్ శంకర్ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అప్పటికే సినిమా హిందీలో డబ్ కావడంతో యూ ట్యూబ్ లోనే నార్త్ జనాలు బాగానే చూసేశారు. ఇక కొంతకాలం ఎదురు చూసి టైగర్ ష్రాఫ్ ఆ సినిమాను రీమేక్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఇంకా అఫీషియల్ గా అయితే ఇది ఇస్మార్ట్ శంకర్ రీమేక్ అని ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. కథను మాత్రం హిందీ జానాల టెస్ట్ కు తగ్గట్టు అలాగే టైగర్ ష్రాఫ్ క్రేజ్ యాక్షన్ లుక్ కు సెట్ అయ్యే విధంగా సెట్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.