Begin typing your search above and press return to search.

వీళ్ల ప‌రిస్థితేంటీ.. నెక్స్ట్ సినిమా వుందా.. లేదా?

By:  Tupaki Desk   |   17 Nov 2022 1:30 AM GMT
వీళ్ల ప‌రిస్థితేంటీ.. నెక్స్ట్ సినిమా వుందా.. లేదా?
X
స్టార్ హీరోల‌ని న‌మ్ముకుని సినిమాలు చేసిన ద‌ర్శ‌కులు ఇప్పుడు మ‌రో సినిమా కోసం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కొంత మంది సినిమాలు ఓకే అయినా కూడా ప‌ట్ట‌లెక్క‌డానికి ఎదురుచూడాల్సిన ప‌రిస్థితి. మ‌రి కొంత మందిది మాత్రం ఇప్ప‌టికీ హీరో ల‌భించ‌ని ప‌రిస్థితి. నెక్స్ట్ సినిమా ఏంటీ?.. ఏ హీరో గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తాడు.. ఏ హీరో డేట్స్ ఖాలీగా వున్నాయి.. ఏ హీరో వెంట‌నే షూట్ కి రెడీ అంటాడా? అని టాలీవుడ్ లో చాలా మంది ద‌ర్శ‌కులు ఎదురుచూస్తున్నారు.

ఇందులో ముందు వ‌రుస‌లో వున్న స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్‌. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో భారీ స్థాయిలో సినిమా చేయాల‌ని ఎన్నో క‌ల‌లు క‌న్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ ని, ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ని ఒప్పించాడు కూడా. 'భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్‌' అంటూ కొత్త త‌ర‌హా టైటిల్ ని, ఫ‌స్ట్ లుక్ ని కూడా విడుద‌ల చేశాడు. ఈ ప్రాజెక్ట్ ప్ర‌క‌టించి రెండేళ్ల‌వుతున్నా ఇప్ప‌టికి ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌లేదు.

ప‌వ‌న్ రాజ‌కీయాల్లో బిజీగా వుండ‌టంతో పాటు ముందు అంగీక‌రించిన 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు'ని పూర్తి చేయ‌క‌పోవ‌డంతో హ‌రీష్ శంక‌ర్ 'భ‌వ‌దీయుడు భ‌గ‌త్‌సింగ్‌' కు బ్రేక్ ప‌డింది. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ ఏడాది కూడా ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌డం క‌ష్ట‌మ‌ని తేలిపోయింది. దీంతో స‌ల్మాన్ తో సినిమా చేయాల‌ని హ‌రీష్ ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టాడు. ఇంకా అక్క‌డి నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రాలేదు. హ‌రీష్ త‌రువాత హీరో కోసం ఎదురుచూస్తున్న ద‌ర్శ‌కుడు సాగ‌ర్ కె. చంద్ర‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో 'భీమ్లానాయ‌క్' మూవీని సాగ‌ర్ కె. చంద్ర తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే.

ఈ మూవీ విజ‌యం సాధించి నెల‌లు గ‌డుస్తున్నా ఈ ద‌ర్శ‌కుడికి మ‌రో ప్రాజెక్ట్ క‌న్ఫ‌ర్మ్ కాలేదు. దీంతో హిట్ సినిమా తీసినా త‌దుప‌రి సినిమా కోసం వేచి చూస్తున్నాడు. శ్రీ‌కాంత్ అడ్డాల‌దీ ఇదే ప‌రిస్థితి. త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ 'అసుర‌న్‌' ఆధారంగా తెలుగులో విక్ట‌రీ వెంక‌టేష్ తో రీమేక్ చేసిన మూవీ 'నార‌ప్ప‌'. దీనికి శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. థియేట‌ర్ల‌లో కాకుండా డైరెక్ట్ ఓటీటీలో విడుద‌లైన ఈ మూవీ తెలుగులోనూ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనిపించుకుంది.

ఈ మూవీ విడుద‌లై ఏడాదిన్న‌ర కావ‌స్తున్నా శ్రీ‌కాంత్ అడ్డాల మ‌రో సినిమా మొద‌లు పెట్ట‌లేదు. క‌నీసం ప్ర‌క‌టించ‌లేదు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం అంద‌రిలానే ఎదురు చూస్తున్నాడు. ఇక రానాతో 'విరాట ప‌ర్వం' మూవీని రూపొందించిన ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల కూడా ఈ మూవీ త‌రువాత మ‌రో ప్రాజెక్ట్ ప్ర‌క‌టించ‌లేదు. ఓ స్టార్ హీరోకు క‌థ వినిపించాడ‌ని వార్త‌లు వినిపించినా ఇంత వ‌ర‌కు అఫీషియ‌ల్ అప్ డేట్ లేదు. 'సాహో' త‌రువాత సుజీత్ సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ తో 'తేరీ' రీమేక్ కోసం ఎదురుచూస్తున్నా అది ఇప్ప‌ట్లో ప‌ట్టాలెక్కేలా క‌నిపించ‌డం లేదు. దీంతో సుజీత్ కూడా వ‌చ్చే ఏడాది వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. రీసెంట్ గా 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని ద‌క్కించుకున్న చందూ మొండేటి త‌దుప‌రి సినిమాని ఇంత వ‌ర‌కు ప్ర‌క‌టించ‌లేదు. బాలీవుడ్ హీరోతో వెళ‌తాడా? లేక టాలీవుడ్ హీరోతో చేస్తాడా? అన్న‌ది తెలియాల్సి వుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.