Begin typing your search above and press return to search.

'రాధే శ్యామ్‌' స్క్రిప్ట్ వెన‌క ఇంత క‌థ వుందా?

By:  Tupaki Desk   |   24 Dec 2021 11:32 AM GMT
రాధే శ్యామ్‌ స్క్రిప్ట్ వెన‌క ఇంత క‌థ వుందా?
X
తెలుగు తెర‌పై వ‌స్తున్న మ‌రో వండ‌ర్ `రాధేశ్యామ్‌`. రొమాంటిక్ ల‌వ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో యువీ సంస్థ నిర్మించింది. `జిల్‌` వంటి కేవ‌లం ఒకే ఒక్క సినిమాతో లైమ్ లైట్ లోకి వ‌చ్చిన ద‌ర్శ‌కుడు రాధా కృష్ణ‌కుమార్ త‌న టాలెంట్ తో రెండ‌వ సినిమానే పాన్ ఇండియా మూవీగా తెర‌పైకి తీసుకురావ‌డం విశేషం. ఇప్ప‌టికే హాట్ టాపిక్ ఆఫ్ ది ఇండియ‌న్ సినిమాగా మారిన ఈ చిత్రం ఈ సంక్రాంతికి జ‌న‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

చేతి రేఖ‌ల‌ని బ‌ట్టి వారి భ‌విష్య‌త్తుని, వారి ప్రాణాలు ఎప్పుడు పోతాయో.. టోట‌ల్ గా వారి జీవిత కాల చ‌క్రాన్ని చెప్ప‌గ‌ల పామిస్ట్ గా విక్ర‌మాదిత్య పాత్ర‌లో ప్ర‌భాస్ క‌నిపించ‌బోతున్నాడు. విధి ఆడిన వింత ఆట‌లో ప్రాణం పోసిన ప్రేమే ప్రాణాలు తీస్తుందా` అనే కాన్సెప్ట్ నేప‌థ్యంలో `టైటానిక్‌` ని త‌ల‌పించే దృశ్యాల‌తో విజువ‌ల్ వండ‌ర్ గా ఈ మూవీని తెర‌కెక్కించారు. గురువారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక‌ని రామోజీ ఫిల్మ్ సిటీలో అత్యంత భారీ స్థాయిలో మేక‌ర్స్ నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే.

ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా మాట్లాడిన ద‌ర్శ‌కుడు `రాధేశ్యామ్‌` స్క్రిప్ట్ వెన‌కున్న క‌థ‌ని బ‌య‌ట‌పెట్టి షాకిచ్చారు. ఈ సంచ‌ల‌న చిత్రాన్ని తీయ‌డానికి నాలుగేళ్లు ప‌ట్టింద‌న్నారు. అంతే కాకుండా ఈ చిత్ర స్క్రిప్ట్ వెన‌కున్న ఆస‌క్తిక‌ర‌మైన అస‌లు క‌థ‌ని బ‌య‌ట‌పెట్టారు. ఈ స్క్రిప్ట్ రాయ‌డానికే 18 ఏళ్లు ప‌ట్టింద‌ని ఎవ‌రూ ఊహించ‌ని షాకిచ్చారు. ఈ సినిమా పాయింట్ ని ముందు మా గురువుగారు చంద్ర శేఖ‌ర్ ఏలేటి వ‌ద్ద విన్నాన‌ని, ఆ స‌మ‌యంలో ఏలేటి గారు ఈ క‌థ‌ని జాత‌కాల నేప‌థ్యంలో రాస్తున్నాము..ఎవ‌రికి రాసిపెట్టి వుందో అని అన్నారని తెలిపారు.

ఆ త‌రువాత ఈ క‌థ‌ని 18 ఏళ్లు ఇండియాలో వున్న పెద్ద పెద్ద రైట‌ర్ల‌తో రాయించాం. కానీ క‌న్‌క్లూజ‌న్ మాత్రం దొర‌క‌లేదు. అయితే చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి గారికి ఈ క‌థ ఛాలెంజింగ్ గా వుండాల‌ని భావించి నేనే ఈ క‌థ‌ని పూర్తి చేసి ప్ర‌భాస్ కు వినిపించాను. ఇది ప్ర‌భాస్ గారికి రాసి పెట్టి వుంది. ఒక ఫిలాస‌ఫీని ఒక క‌థ‌లా రాసి ఆయ‌న‌కు చెప్పాను. ఆయ‌న‌కు కూడా బాగా న‌చ్చింది. ఈ సినిమాలో ఫైట్లు, ఛేజ్ లు వుండ‌వు...ఒక అమ్మాయికి, అబ్బాయికి మ‌ధ్య జ‌రిగే యుద్ధాలు ఉంటాయి. ఒక అమ్మాయి కోసం ఓ అబ్బాయి స‌ప్త స‌ముద్రాలు దాటి ముందుకెళ్లే జ‌ర్నీనే ఈ ప్రేమ‌క‌థ‌.

ప్ర‌భాస్ చెప్పినట్టు `ఇట్స్ బియాండ్ యువ‌ర్ అండ‌ర్ స్టాండింగ్. ట్రైలర్ జ‌స్ట్ ఇన్విటేష‌న్ మాత్ర‌మే. 4 ఏళ్లు స‌పోర్ట్ చేసిన చిత్ర బృందానికి ధ‌న్య‌వాదాలు` అని తెలిపారు రాధాకృష్ణ కుమార్‌. నిజ‌మే రాధాకృష్ణ కుమార్ చెప్పిన‌ట్టు ట్రైల‌ర్ జ‌స్ట్ ఇన్విటేష‌న్ లానే క‌నిపిస్తోంది. కానీ ఇన్విటేష‌నే ఇలా వుంటే తెర‌పై సినిమా ఇంకే రేంజ్‌లో వుంటుందో ఊహించుకోవ‌చ్చు. ట్రైల‌ర్ చూసిన వాళ్లు మాత్రం భార‌తీయ తెర‌పై `టైటానిక్‌` అడ్వాన్స్డ్ వెర్ష‌న్ లా వుంద‌ని త‌మ ఆనందాన్నివ్య‌క్తం చేస్తున్నారు.

ట్రైల‌ర్ తో ఇప్ప‌టికే అంచ‌నాల్ని సెట్ చేసిన `రాధే శ్యామ్‌` ఇండియన్ సినీ హిస్ట‌రీలో ఏ స్థాయి సంచ‌ల‌నాల‌కు తెర లేపుతుందో.. టాలీవుడ్ ని ఏ రేంజ్‌కి తీసుకెళుతుందో వేచి చూడాల్సిందే అంటున్నాయి ట్రేడ్ వ‌ర్గాలు.. ట్రైల‌ర్ తో క్లారిటీ తెచ్చుకున్న వారు మాత్రం వ‌ర‌ల్డ్ వైడ్ గా మ‌రోసారి తెలుగోడి స‌త్తాని స‌గ‌ర్వంగా చాట‌బోతున్నామ‌ని గ‌ర్వంగా చెబుతున్నారు.