Begin typing your search above and press return to search.

ఫ్లాప్‌ 'నవరస' వెనుక అంత మంచి ఉద్దేశ్యం ఉందా!!

By:  Tupaki Desk   |   5 Oct 2021 2:30 AM GMT
ఫ్లాప్‌ నవరస వెనుక అంత మంచి ఉద్దేశ్యం ఉందా!!
X
తమిళ దిగ్గజ దర్శకుడు మణిరత్నం నిర్మాణంలో రూపొందిన 'నవరస' వెబ్‌ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. జయేంద్ర సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ వెబ్‌ సిరీస్ ను ప్రముఖ ఓటీటీ నెట్‌ ఫ్లిక్స్ వారు స్ట్రీమింగ్ చేశారు. స్ట్రీమింగ్ ముందు వరకు ఈ వెబ్‌ సిరీస్ పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి. స్ట్రీమింగ్‌ అయిన తర్వాత వచ్చిన టాక్ తో అంతా నీరస పడిపోయారు. కొందరు చాలా ఆసక్తిగా ఎదురు చూసి కూడా వచ్చిన టాక్‌ తో ఇక చూడనవసరం లేదు అనుకున్నారట. అయితే ఎంతో మంది స్టార్స్ ను ప్రముఖ ఫిల్మ్‌ మేకర్స్ ను ఒకే వేదిక మీదుకు తీసుకు వచ్చిన గొప్ప వెబ్‌ సిరీస్ మాత్రం నవరస నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. సూర్య.. విజయ్ సేతుపతి.. ప్రకాష్ రాజ్ వంటి మేటి నటీనటులు మరియు మణిరత్నం.. గౌతమ్ మీనన్ ఇంకా దిగ్గజ దర్శకులు కలిసి పని చేసిన వెబ్ సిరీస్ అవ్వడం వల్ల నవరస ప్లాప్ అయినా కూడా ప్రత్యేకమైనదిగా అంతా కితాబిస్తూనే ఉంటారు.

ఈ ప్లాప్ నవరస వెనుక ఒక అద్బుతమైన ఉద్దేశ్యం ఉందట. ఆ విషయాన్ని ఇన్ని రోజులు పెద్దగా ప్రచారం చేయలేదు. కాని ఇప్పుడు నవరస ఉద్దేశ్యం కరోనా వల్ల సఫర్‌ అయిన సినీ కార్మికుల సంక్షేమం కోసం అని తేల్చి చెప్పారు. కరోనాతో సినీ కార్మికులు కొందరు తినడానికి కనీసం తిండి లేక ఇబ్బందులు పడ్డారు. అలాంటి వారికి గాను నవరస తిండి పెట్టిందట. తమిళ మీడియా వర్గాలు మరియు ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఏకంగా 12 వేల మంది తమిళ సినీ కార్మికులు మరియు వారి కుటుంబాల పొట్ట నింపేందుకు గాను మణిరత్నం నవరస వెబ్‌ సిరీస్ ఉపయోగపడిందని అంటున్నారు. ఈ వెబ్‌ సిరీస్ లో నటించిన వారు అంతా కూడా ఛారిటీ కోసం నటించిన వారే. ఇది కమర్షియల్‌ యాంగిల్‌ లో తీసిన వెబ్‌ సిరీస్ కాదు.

నెట్ ఫ్లిక్స్‌ భారీ మొత్తంలో ఈ వెబ్‌ సిరీస్ కు చెల్లించి కొనుగోలు చేయడం జరిగింది. నటీ నటులకు ఎలాంటి పారితోషికాలు లేవు.. టెక్నీషియన్స్ కు కూడా పారితోషికం లేదు. కనుక ప్రొడక్షన్ కాస్ట్ చాలా వరకు తగ్గింది. ఆ మొత్తంను నిర్మాతలు తీసుకుని మిగిలిన మొత్తం ను సంక్షేమం కోసం ఉపయోగించారని టాక్‌ వినిపిస్తుంది. ఇలాంటి మంచి పనులు చేయడం నిజంగా అభినందనీయం. కరోనా సమయంలో కొన్ని లక్షల మంది నిరుద్యోగులు అయ్యారు. వారందరికి తినడానికి తిండి కూడా లేక చాలా ఇబ్బంది పడ్డారు. అలాంటి వారి కోసం చాలా మంది చాలా రకాలుగా కరోనా బాధితుల కోసం పని చేశారు. తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన మణిరత్నం ఇతరులు తమవంతు అన్నట్లుగా ఈ నవరస కు నటించి దాంతో వచ్చిన డబ్బును 12 వేల మంది కడుపు నింపారు. ఇది ఖచ్చితంగా అభినందనీయం. నవరస ఫలితం తో సంబంధం లేకుండా వారు చేసిన ఉద్దేశ్యం అభినందనీయం.