Begin typing your search above and press return to search.

పెళ్లి ఛాన్సే లేదు మరి ప్రేమైనా ఉందా? లేదా?

By:  Tupaki Desk   |   28 Oct 2021 4:11 AM GMT
పెళ్లి ఛాన్సే లేదు మరి ప్రేమైనా ఉందా? లేదా?
X
బాలీవుడ్‌ హాట్ బ్యూటీ కత్రీనా కైఫ్ మరియు యంగ్‌ హీరో విక్కీ కౌశల్‌ లు ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. వీరిద్దరు గత కొన్నాళ్లుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇద్దరు కూడా చాలా క్లోజ్‌ గా ఉంటున్నారు. పార్టీలకు కలిసి హాజరు అవ్వడంతో పాటు ఎక్కువ సమయం కలిగి గడుపుతున్నారు అంటూ బాలీవుడ్‌ మీడియాలో పదే పదే కథనాలు వస్తున్నాయి. వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకుంటారు అంటూ వార్తలు వస్తున్నాయి. పెళ్లి.. ప్రేమ వార్తలు ఈమద్య చాలా కామన్ గా వస్తున్న నేపథ్యంలో కత్రీనా కైఫ్‌ స్పందించింది. ఆమె వ్యాఖ్యలు కాస్త షాకింగ్ గా అనిపించాయి. గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకోబోతున్నారా అంటూ ప్రశ్నించిన సమయంలో ఆమె ఇచ్చిన సమాధానం అందరికి ఆశ్చర్యంను కలిగించింది.

కత్రీనా ఒక చిట్ చాట్ లో మాట్లాడుతూ.. గత 15 ఏళ్లుగా నా పెళ్లి గురించి మీడియా పదే పదే కథనాలను రాస్తూనే ఉంది. ప్రతి కథనంలో కూడా నాకు పెళ్లి అంటూ ఉన్నారు. నెలకు ఒక పెళ్లి చొప్పున నాకు పెళ్లిలు చేస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక విక్కీ కౌశల్‌ తో పెళ్లి గురించి స్పందిస్తూ అలాంటి ప్లాన్స్ మా ఇద్దరికి ఏమీ లేవని తేల్చి పారేసింది. తామిద్దరం అలాంటి ఆలోచనలు కలిగి లేమని చెప్పడం ఒకింత ఆశ్చర్యంను కలిగిస్తుంది. ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటున్నారు.. ఇద్దరు కూడా పార్టీలకు కలిసి తిరిగుతూ ఎంజాయ్‌ చేస్తున్న ఈ సమయంలో పెళ్లి ఆలోచన లేదు అంటూ ప్రకటన చేయడం కాస్త విడ్డూరంగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

పెళ్లి ఛాన్సే లేదు అంటున్న కత్రీనా కనీసం విక్కీ కౌశల్ తో ప్రేమలో అయినా ఉందా లేదంటే ఇన్ని రోజులు అతడితో కేవలం టైమ్‌ పాస్ కోసం తిరిగిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రేమ లేకుంటే ఎందుకు ఇన్నాళ్లు అతడిని వెంట వేసుకుని తిరగడం అంటూ మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. కత్రీనా ఇప్పటికే పలువురు బాయ్ ఫ్రెండ్స్ ను మార్చింది... ఆమె మాటలను బట్టి చూస్తుంటే త్వరలో ఆమె మరో కొత్త బాయ్ ఫ్రెండ్ తో చెట్టా పట్టాలేసుకుని తిరుగబోతుందేమో అనిపిస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. కత్రీనా ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు పలువురు హీరోలతో ప్రేమాయణం సాగించినట్లుగా వార్తలు వచ్చాయి. విక్కీ కౌశల్‌ తో ప్రేమలో ఉన్నట్లుగా గత రెండు మూడు ఏళ్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది.