Begin typing your search above and press return to search.

ఉప్పెనలా 'లవ్ స్టోరీ'లో ఓ బోల్డ్ పాయింట్ ఉండబోతుందా..??

By:  Tupaki Desk   |   25 March 2021 12:30 PM GMT
ఉప్పెనలా లవ్ స్టోరీలో ఓ బోల్డ్ పాయింట్ ఉండబోతుందా..??
X
సినిమా ఇండస్ట్రీలో కరోనా అనేది ఎన్నో మార్పులకు నాంది పలికింది. ఎందుకంటే లాక్డౌన్ సమయంలో ఇంటిపట్టునే ఉంటూ జనాలు ఓటిటి వేదికల ద్వారా అన్ని భాషల సినిమాలపై ఓ లుక్కేశారు. తెలుగులోకంటే వేరే భాషల్లోనే సినిమాలలో అద్భుతమైన కంటెంట్ ఉందంటూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అందుకే ఇప్పుడు తెలుగు సినిమాల్లో కొత్తదనం, కొత్త కంటెంట్ లేకపోతే సినిమాలను ఆదరించట్లేదు. తెలుగులో సంవత్సరానికి ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతాయి. కానీ జనాలకు నచ్చేవి.. జనాలు మెచ్చేవి పదిలోపే ఉంటాయి. అంటే అర్ధం చేసుకోవాలి మన సినిమాలలో కొత్తదనం ఏ రేంజిలో ఉందో. తాజాగా శేఖర్ కమ్ముల రూపొందించిన లవ్ స్టోరీ మూవీలో కూడా వెరైటీ పాయింట్ టచ్ చేసినట్లు టాక్.

నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 16న థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు సినిమా పై అంచనాలను అమాంతం పెంచేసాయి. ముఖ్యంగా సారంగదరియా సాంగ్ యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో శేఖర్ కమ్ముల ఓ బోల్డ్ పాయింట్ చూపించనున్నాడట. ఇదివరకు ఉప్పెన సినిమా సినిమాలో ఓ బోల్డ్ పాయింట్ జనాలు అంగీకరించేలా చూపించారు. కానీ ఇటీవల విడుదలైన చావుకబురు చల్లగా సినిమాలో కూడా బోల్డ్ పాయింట్స్ ఉన్నాయి. తల్లికొడుకు కలిసి మందు తాగడం, అలాగే హీరో తల్లికి వేరే వ్యక్తితో అక్రమసంబంధం ఉండటం లాంటివి చూపించారు. కానీ జనాలకు అంతగా ఎక్కలేదనే చెప్పాలి. మరి లవ్ స్టోరీలో శేఖర్ కమ్ముల కొత్త పాయింట్ చూపిస్తాడా..! అనేది చూడాలి!