Begin typing your search above and press return to search.

ఎమోషన్స్ ఉన్నాయా ఎన్టీఆర్ ?

By:  Tupaki Desk   |   5 Dec 2018 6:53 AM GMT
ఎమోషన్స్ ఉన్నాయా ఎన్టీఆర్ ?
X
మహానటి ఘన విజయం స్వర్గస్తులైన నటీనటుల బయోపిక్ లు రూపొందానికి స్ఫూర్తినిచ్చిందన్న మాట ముమ్మాటి కీ వాస్తవం. అసలు ఆ సినిమా రాకపోతే ఇప్పుడు నిర్మాణం లో ఉన్న సుమారు ఐదారు ఆత్మకథ లు సెట్స్ పైకి వెళ్ళేవి కావేమో. బాలకృష్ణ కు ఎన్టీఆర్ తీయాలన్న తలంపు పుట్టింది కూడా అది చూసా కే అని అర్థమైపోయింది. ఇప్పుడు విడుదల తేదీ దగ్గర పడుతోంది. మహా అయితే ఇంకో నెల రోజుల కు కథానాయకుడు తెర పైకి వచ్చేస్తాడు. పబ్లిసిటీ విషయంలో ఎన్టీఆర్ సంక్రాంతి సినిమాలలో ముందు వరసలో ఉంది.

కానీ ఇప్పటి దాకా వచ్చినవన్నీ ఎన్టీఆర్ నటజీవితంలో వివిధ ఆరిస్టులు పోషించిన పాత్రలు ఆయా సినిమాలలోని బిట్లను రీ షూట్ చేసిన స్టిల్స్ ఇంతే. కైకాల సత్యనారాయణతో మొదలుకుని రకుల్ ప్రీత్ సింగ్ దాకా ఎవరిని చూసుకున్నా అప్పటి గెటప్స్ లో వీళ్ళు కనిపించడం బాగానే అనిపించింది కానీ సినిమా కంటెంట్ లో ఫీల్ ఎంతవరకు ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మహానటి అంత పెద్ద సక్సెస్ కావడానికి కారణం కేవలం అప్పటి సినిమా జ్ఞాపకాలను తిరిగి చూపించడం కాదు. వాటిని కేవలం సపోర్ట్ కోసమే వాడుకున్నాడు దర్శకుడు నాగ అశ్విన్. అంతకు మించి బలమైన ఎమోషన్ అందులో ఉంది. సావిత్రి బాల్యంలో నటన నేర్చుకోవడం మొదలుకుని వేషాల కోసం మదరాసు వచ్చినప్పుడు అమాయకంగా పెదనాన్నను నాన్న అని పిలుచుకుని మురిసిపోవడం దాకా చాలా చూడముచ్చటగా ఉంటుంది.నటిగా గొప్ప స్థితికి చేరాక తాగుడుకు అలవాటై పతనాన్ని ఎలా కొనితెచ్చుకుందో చూసి కంటతడి పెట్టుకున్న ప్రేక్షకులే ఎక్కువ.

కానీ ఎన్టీఆర్ లో అన్నేసి ఎమోషన్స్ ఉంటాయా అనే దాని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. ఇది కేవలం ఎన్టీఆర్ గొప్పదనాన్ని వర్ణిస్తూ ఆయన్ను స్తుతించడానికి మాత్రమే తీసిన సినిమా అని ఆయన నటించిన బ్లాక్ బస్టర్స్ లో పాటలు సన్నివేశాలతోనే అధిక శాతం సినిమా ఉంటుందని ఇప్పటి కే ఇన్ సైడ్ టాక్. అదే నిజమైతే ఎమోషన్ లేకుండా ఈ హంగులతోనే ఎన్టీఆర్ ఆకట్టుకోవడం కష్టం. నందమూరి ఫాన్స్ మెచ్చవచ్చేమో కానీ సాధారణ ప్రేక్షకుడు కనెక్ట్ కాలేడు. అలాంటప్పుడు ఎన్టీఆర్ జీవితంలో ఒడిదుడుకులను నిజాయితి గా చూపించగలగాలి. మరి ఎన్టీఆర్ అంత ఎమోషనల్ వెయిట్ ని తీసుకుని మెప్పిస్తాడా లేక పై పై మెరుగులుతో పోస్టర్స్ లో చూపించినట్టు ఉత్తి హడావిడి చేస్తారా చూడాలి మరి