Begin typing your search above and press return to search.

కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ తో చెర్రీ మూవీ లేన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   18 Oct 2021 1:16 PM IST
కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ తో చెర్రీ మూవీ లేన‌ట్టేనా?
X
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే శంక‌ర్ తో ఆర్.సి 15 ప్రారంభ‌మైంది. రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌కు రెడీ అవుతున్నారు. త‌దుప‌రి జెర్సీ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరితో ప్రాజెక్ట్ ని క‌న్ఫామ్ చేశారు చ‌ర‌ణ్‌. అలాగే ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలోనూ సినిమా ఉంటుంద‌ని క‌థ‌నాలొచ్చాయి.

రామ్ చరణ్- చిరంజీవిని ఇటీవ‌లే ప్ర‌శాంత్ నీల్ క‌లిసారు. విందు ఆర‌గించారు. అనంత‌రం దీని గురించి ప్ర‌శాంత్ నీల్ ఒక ట్వీట్ ను పంచుకున్నారు. ఈ సమావేశంలో నిర్మాత డివివి దానయ్య కూడా ఉన్నారు. ఆ క్ర‌మంలోనే ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌నా లేకుండా.. రామ్ చరణ్- ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఖాయ‌మైందంటూ మీడియా ఒకటే క‌థ‌నాల్ని వండి వార్చింది. ప్రశాంత్ నీల్ ట్వీట్ పోస్ట్ చేయడానికి ముందే మీడియా ఈ వార్తల చుట్టూ హైప్ ని క్రియేట్ చేసింది. తన ట్వీట్ ను షేర్ చేసిన తర్వాత ప్రశాంత్ నీల్ తో చెర్రీ కలిసి పని చేస్తున్నారని మ‌రోసారి మీడియాలో నిర్ధారించారు. కానీ ఇప్పుడు ఊహించ‌ని విధంగా చ‌ర‌ణ్ ఈ వార్త‌ను ఖండించారు.

ఇటీవ‌ల `నాట్యం` ప్రీ రిలీజ్ ఈవెంట్ స‌మ‌యంలో ఓ మీడియా ప్రతినిధి .. ప్రశాంత్ నీల్ తో తన సినిమా గురించి ఆసక్తికరమైన వివరాలను తెలియజేయమని కోరారు. కానీ రామ్ చరణ్ జ‌వాబు ఆశ్చర్య‌ప‌రిచింది. ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నారా? అన్న ప్ర‌శ్న‌కు..``ఇది కేవలం విందు సమావేశం. భవిష్యత్తులో ఏదైనా ఉంటే మేము ప్రకటిస్తాము`` అని అన్నారు. రామ్ చరణ్ న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌తో ఈ కాంబినేషన్లో సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ ఎదురైంది.

ప్ర‌శాంత్ నీల్ ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా పూర్తి బిజీగా ఉన్నారు. ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా స‌లార్ చిత్రీక‌ర‌ణ సాగుతోంది. త‌దుప‌రి ఎన్టీఆర్ తో ఓ సినిమాని చేయాల్సి ఉండ‌గా.. ప్ర‌భాస్ తో మ‌రో సినిమా చేసేందుకు క‌మిట‌య్యారు. ఇప్పుడు మ‌రో టాలీవుడ్ అగ్ర హీరో రామ్ చ‌ర‌ణ్ తో సినిమా చేయాల‌న్న ఆలోచ‌నతో ఉన్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ ఎప్ప‌టికి ప్రారంభ‌మ‌వుతుందో క్లారిటీ లేదు.

స‌లార్ త‌ర్వాతా ప్ర‌భాస్ స్క్రిప్ట్ రెడీ

కేజీఎఫ్ చిత్రంతో సంచ‌ల‌నాలు సృష్టించిన‌ ప్ర‌శాంత్ నీల్ కేజీఎఫ్- 2తో మ‌రో లెవ‌ల్లో సంచ‌ల‌నాల‌కు సిద్ధ‌మ‌వుతున్నాడు. ఆ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ ఏ సినిమా చేయ‌బోతున్నాడు? అన్న‌దానికి కూడా ఇప్ప‌టికే క్లారిటీ వ‌చ్చేసింది. ప్ర‌స్తుతం సాలార్ కోసం ప్రశాంత్ నీల్ తో క‌లిసి ప‌ని చేస్తున్న‌ ప్రభాస్ త‌దుప‌రి మ‌రో చిత్రానికి అత‌డికి క‌మిట్ మెంట్ ఇచ్చేశారు. ఇప్ప‌టికే స్క్రిప్టు ప‌నులు సాగుతున్నాయి. అత్యంత ఉత్కంఠభరితమైన ఈ ప్రాజెక్ట్ అని తెలిసింది. అత్యంత భారీ బడ్జెట్ తో తెర‌కెక్కనున్న ఈ సినిమా `పౌరాణిక యాక్షన్ థ్రిల్లర్` అని తెలిసింది. దీని కోసం ప్రభాస్ - ప్రశాంత్ నీల్ మళ్లీ సహకరిస్తారు. తాజా లీకుల ప్ర‌కారం.. ప్రశాంత్ .. ప్రభాస్ కోసం ఒక సంచలన స్క్రిప్ట్ రాశాడు. పౌరాణిక అంశాలను కలిగి ఉండే స్క్రిప్ట్ తో ముందుకు వచ్చాడు. భారతీయ సినిమా తెర‌పై మునుపెన్నడూ చూడని స‌రికొత్త విజువ‌ల్ వండ‌ర్ అవుతుందని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ తన ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తి చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్తుంది. ఆదిపురుష్ తర్వాత ఇది అతని రెండవ పౌరాణిక చిత్రం. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.