Begin typing your search above and press return to search.

ఈ సమయంలో బాలీవుడ్ లో లాబీయింగ్ అవసరమా?

By:  Tupaki Desk   |   4 May 2020 11:30 AM GMT
ఈ సమయంలో బాలీవుడ్ లో లాబీయింగ్ అవసరమా?
X
సౌత్ సినిమాలు రెండు మూడు దేశవ్యాప్తంగా భారీ విజయాలు సాధించడం.. ఒకరిద్దరు హీరోలు దేశమంతా గుర్తింపు తెచ్చుకోవడంతో ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరికీ ఈమధ్య ప్యాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకోవాలనే ఆరాటం ఎక్కువైందనే సినీవర్గాలలో టాక్ వినిపిస్తోంది. తమవద్దకు కథలు తీసుకొస్తున్న దర్శకులను యూనివర్సల్ అప్పీల్ ఉండేవిధంగా మార్చాలనే ఒత్తిడి చేస్తున్నారట. మరోవైపు కొందరు హీరోలు బాలీవుడ్ ఫిలిం మేకర్లతో టచ్ లో ఉంటూ క్రేజీ హిందీ ప్రాజెక్టులలో నటించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారట.

బాలీవుడ్ లో 'ధూమ్' సీరీస్ సినిమాలు భారీ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇప్పటివరకూ ఈ ఫ్రాంచైజీలో మూడు సినిమాలు విడుదలైతే అన్నీ ఒకదాన్ని మించి మరొకటి విజయం సాధించాయి. ప్రస్తుతం యష్ రాజ్ ఫిలిమ్స్ వారు ఈ ఫ్రాంచైజీ లో నాలుగవ సినిమాకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ ధూమ్ 4 లో నటించేందుకు ఆమిర్ ఖాన్ ఇప్పటికే పచ్చజెండా ఊపారని కూడా బాలీవుడ్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమాలో నటించేందుకు ముగ్గురు టాలీవుడ్ స్టార్లు.. ఒక యువ హీరో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారట.

ఈ ప్రయత్నాలు చేస్తున్న ఈ హీరోలపై ఇండస్ట్రీలో విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ ఎంతో మంది ప్రతిభావంతులైన దర్శక రచయితలు ఉన్నారని.. వారికి అవకాశాలు ఇవ్వకుండా ముంబై లో ఆఫర్ల కోసం లాబీయింగ్ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ లోకల్ గా ఉన్న తెలుగువారిని ప్రోత్సహిస్తే అంతకంటే మంచి సబ్జెక్ట్ లు తయారు చెయ్యగలరని.. కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో కథను కిచిడి చెయ్యడం మానుకుంటే ఆటోమేటిక్ గా మంచి కథలు అందుబాటులోకి వస్తాయని అంటున్నారు. అసలే కరోనా క్రైసిస్ ఇబ్బంది పడుతున్న ఇండస్ట్రీని కాపాడాల్సిన హీరోలు ఇలా బాలీవుడ్ పై ఫోకస్ చేయడం సరికాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.