Begin typing your search above and press return to search.

ఈ సమయంలో ఫ్లాప్‌ సెంటిమెంట్‌ అవసరమా రామ్‌?

By:  Tupaki Desk   |   17 Oct 2022 2:30 PM GMT
ఈ సమయంలో ఫ్లాప్‌ సెంటిమెంట్‌ అవసరమా రామ్‌?
X
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రస్తుతం ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రామ్ కి చాలా కీలకం. అఖండ వంటి భారీ విజయం తర్వాత రాబోతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.

బాలకృష్ణ కి సూపర్ హిట్ ఇచ్చిన తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో పొందుతున్న ఈ సినిమా ఖచ్చితంగా మరో అఖండ సినిమా అన్నట్లుగా ఉంటుందని నమ్మకమం ను రామ్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో కీలక పాత్రకు గాను బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి ని ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి. రామ్ కి తండ్రి పాత్రలో సునీల్ శెట్టి కనిపించబోతున్నాడని టాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఈ విషయమై రామ్‌ ఫ్యాన్స్‌ ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు, సునీల్ శెట్టి తెలుగులో మోసగాళ్లు మరియు గని చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే, ఆ రెండు సినిమాల పరిస్థితి.. ఫలితం ఏంటో అందరికీ తెలిసిందే.

అయినా కూడా రామ్ సినిమా లో ఆయనను నటింపజేయడం కచ్చితంగా మంచి పరిణామం కాదని.. బ్యాడ్ సెంటిమెంట్ అవసరమా అంటూ రామ్‌ ని కొందరు ప్రశ్నిస్తున్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమా కథ కి రామ్ తండ్రి పాత్రలో సునీల్ శెట్టి అయితే బాగుంటుందని అభిప్రాయంతో ఉన్నాడని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.

అతి త్వరలోనే సినిమాకు సంబంధించిన అధికారిక ఫస్ట్‌ లుక్‌ వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.. రామ్ గత చిత్రం ది వారియర్‌ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. అందుకే ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.

మరి అంచనాలకు తగ్గట్లుగా బోయపాటి శ్రీను ఈ సినిమా ను తీసుకొస్తాడా.. తెలుగులో సునీల్ శెట్టి ఈ సినిమా తో మొదటి కమర్షియల్ సక్సెస్ ని దక్కించుకుంటాడా అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.