Begin typing your search above and press return to search.

దిశా ప‌టానీకి ఆఫ‌ర్లు ఏమీ లేవా?

By:  Tupaki Desk   |   30 April 2022 11:30 PM GMT
దిశా ప‌టానీకి ఆఫ‌ర్లు ఏమీ లేవా?
X
'లోఫ‌ర్' చిత్రంతో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన దిశా ప‌టానీ ఒక్క సినిమాతోనే వెనుదిరిగిన సంగ‌తి తెలిసిందే. తొలి సినిమా యావ‌రేజ్ టాక్ తెచ్చుకున్నా దిశ‌కి తెలుగులో అవ‌కాశాలు రాలేదు. దీంతో అమ్మ‌డు బాలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్క‌డ 'ఎమ్ ఎస్ ధోనీ 'చిత్రంతో లాచ్ అయి తొలి హిట్ ఖాతాలో వేసుకుంది. అటుపై 'భాఘీ-2' తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది.

అక్క‌డ నుంచి దిశ ద‌శ తిరిగింది. బ్యాక్ టూ బ్యాక్ అవ‌కాశాల‌తో బిజీ అయింది. అదే స‌మయంలో స్టార్స్ చిత్రాల్లో క్యామియో పాత్ర‌ల్లో సైతం న‌టించింది. న‌టిగా అన్ని కోణాల్లోఆవిష్కరించుకే ప్ర‌య‌త్నం చేసి స‌క్సెస్ అయింది. ప్ర‌స్తుతం అక్క‌డ కెరీర్ హ్యాపీగానే సాగిపోతుంది. 'ఏక్ విల‌న్ రిట‌ర్స్'.. 'యోధ' చిత్రాల్లో నటిస్తోంది. ఆ సినిమా షూటింగ్ లు కూడా పూర్తయ్యాయి.

'టీనా' అనే సినిమా మాత్రం ఆన్ సెట్స్ లో ఉంది. ఆర‌కంగా అమ్మ‌డు బాలీవుడ్ కే ప‌రిమిత‌మైంది. హిందీ సినిమాలే టార్గెట్ గా ప‌నిచేస్తోంది. ఇత‌ర భాష‌ల ప్ర‌య‌త్నాల జాడ ఎక్క‌డా క‌నిపించలేదు.

ఈ బ‌క్క‌ప‌ల‌చ‌ని భామ సౌత్ కి క‌నెక్ట్ అవ్వ‌డం క‌ష్ట‌మ‌ని తొలి నాళ్ల‌లోనే విమ‌ర్శ‌లొచ్చాయి. ఉత్త‌రాది అభిరుచికి భిన్నంగా సౌత్ రుచుల్లో ఇమ‌డటం అంటే చాలా మార్పులే తీసుకురావాలి. దానిపై అమ్మ‌డు దృష్టి పెట్ట‌లేదు.

ఇక రెగ్యుల‌ర్ గా దిశా పటానీ ఇన్ స్టా వేదిక‌గా మంట‌లు రేపుతున్న సంగ‌తి తెలిసిందే. డిజైన‌ర్ దుస్తుల్లో అమ్మ‌డు గుబులు రేపుతుంది. ఫిట్ నేస్ ప్రీక్ గాళ్ గా మార్క్ వేసింది. త‌రుచూ యోగా సెష‌న్ వీడియోస్ ..ఫోటోల‌తోనూ అగ్గి రాజేస్తుంది.

తాజా ఫోటోని ప‌రిశీలిస్తే.. క్లీవేజ్ అందాల‌తో నెట్టింట దుమారం రేపుతుంది. వంగ‌పువ్వు రంగు డిజైన‌ర్ లో హాట్ గా కెమెరాకి ఫోజులిచ్చింది. మ‌త్తెక్కించే చూపుల‌తో యువ‌త‌ని ఆక‌ర్షిస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. అభిమానులు హాట్ కామెంట్లు షురూ చేసారు.