Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌ 3... తీన్మార్‌ సావిత్రి నిజమేనా?

By:  Tupaki Desk   |   10 Jun 2019 5:54 AM GMT
బిగ్‌ బాస్‌ 3... తీన్మార్‌ సావిత్రి నిజమేనా?
X
ఒకవైపు తమిళ బిగ్‌ బాస్‌ 3 ప్రారంభంకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. మొదటి రెండు సీజన్‌ లకు హోస్ట్‌ గా వ్యవహరించిన కమల్‌ హాసన్‌ మూడవ సీజన్‌ కు కూడా హోస్ట్‌ గా వ్యవహరించబోతున్నాడు. మరో వైపు తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 గురించి గత కొన్ని నెలలుగా మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి కాని అధికారికంగా అయితే ప్రకటన రావడం లేదు. ముఖ్యంగా హోస్ట్‌ విషయంలో ఇన్ని రోజులు చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. హోస్ట్‌ గా నాగార్జున దాదాపుగా ఓకే అయ్యాడు. ఇక ప్రస్తుతం పార్టిసిపెంట్స్‌ ఎంపిక విషయంలో చర్చలు జరుగుతున్నాయి.

బిగ్‌ బాస్‌ 3 లో పార్టిసిపెంట్స్‌ అంటూ కేఏ పాల్‌ మరియు రేణు దేశాయ్‌ ఇంకా ఎంతో మంది పేర్లు వస్తున్నాయి. కాని అవన్నీ పుకార్లే. రేణు దేశాయ్‌.. కేఏ పాల్‌ లు పార్టిసిపేట్‌ చేయకపోవచ్చు. ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి తోచిన విధంగా వారు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో నిజమైన పార్టిసిపెట్స్‌ ఎవరై ఉంటారా అంటూ జనాలు జట్టు పీక్కుంటున్నారు.

ఈ సమయంలోనే తీన్మార్‌ సావిత్రి పేరు కూడా బిగ్‌ బాస్‌ 3 పార్టిసిపెంట్స్‌ జాబితాలో ఉందంటూ వార్తలు వస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా వీ6లో ప్రసారం అవుతున్న తీన్మార్‌ వార్తలతో సావిత్రి అలియాస్‌ జ్యోతి బాగా ఫేమస్‌ అయ్యింది. తెలంగాణ అమ్మాయిగా బిగ్‌ బాస్‌ 3 లో జ్యోతి ఎంట్రీ ఉండవచ్చు అంటున్నారు. ఇప్పటికే బిగ్‌ బాస్‌ నిర్వాహకులు ఆమెను సంప్రదించినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే సక్సెస్‌ ఫుల్‌ గా దూసుకు పోతున్న తీన్మార్‌ వార్తలను వదిలేసి జ్యోతి బిగ్‌ బాస్‌ లో పార్టిసిపెట్‌ చేయకపోవచ్చు అనే వాదన కూడా వినిపిస్తుంది.

సావిత్రితో పాటు మరో తెలంగాణ అమ్మాయి శ్రీముఖి కూడా ఇందులో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది. జులై నెలలో బిగ్‌ బాస్‌ మూడవ సీజన్‌ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.