Begin typing your search above and press return to search.

ఈ వయసులో అక్కగా అమ్మగా కాకుండా హీరోయిన్‌ ఛాన్స్‌ లు వస్తాయా?

By:  Tupaki Desk   |   30 Nov 2019 4:53 PM IST
ఈ వయసులో అక్కగా అమ్మగా కాకుండా హీరోయిన్‌ ఛాన్స్‌ లు వస్తాయా?
X
ఒకప్పటి స్టార్‌ హీరోయిన్స్‌ అంతా ఇప్పుడు స్టార్‌ హీరోల సినిమాల్లో అక్కగా.. అమ్మగా పాత్రలు చేస్తున్న విషయం తెల్సిందే. స్నేహ.. నదియా నుండి టబు వరకు పలువురు నిన్నటి తరం హీరోయిన్స్‌ అక్కగా.. అమ్మగా లేదంటే అత్తగా రీ ఎంట్రీ ఇచ్చారు. అందులో చాలా మంది సక్సెస్‌ అయ్యి మళ్లీ మునుపటి క్రేజ్‌ తో దూసుకు పోతున్నారు. ఇలాంటి సమయంలో కొందరు సీనియర్‌ హీరోయిన్స్‌ మాత్రం తమను తాము ఏదో ఊహించుకుంటూ అమ్మ పాత్రలు అత్త పాత్రలు చేయమంటూ భీష్మించుకు కూర్చుంటున్నారు.

తెలుగమ్మాయి అయిన లయ హీరోయిన్‌ గా చాలా సంవత్సరాల పాటు కొనసాగింది. అవకాశాలు తగ్గిన సమయంలో ఎన్నారైను వివాహం చేసుకుని అమెరికాలో సెటిల్‌ అయ్యింది. పెళ్లి.. పిల్లల కారణంగా ఇంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన లయ ఇప్పుడు మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్లుగా ఆమె మాటల ద్వారా తెలుస్తోంది. కాని అక్కగా అమ్మగా మాత్రం నటించేందుకు తాను ఆసక్తిగా లేనంటూ లయ చెప్పుకొచ్చింది.

అమర్‌ అక్బర్‌ ఆంటోనీ సినిమాలో ఒక పాత్రను చేసిన లయ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. మళ్లీ కథలో ప్రాముఖ్యత ఉన్న పాత్రలను చేసేందుకు ఈమె ఆసక్తి చూపిస్తుంది. ఈ వయసులో వచ్చిన పాత్రలను చేసుకుంటూ వెళ్లాలి తప్ప ఆ పాత్ర కావాలి.. ఈ పాత్ర చేయను అంటూ కండీషన్స్‌ పెడితే కష్టం. లయ కూడా కాస్త తగ్గి అక్కగానో లేదా అమ్మ గానో సినిమాలు చేస్తే తప్ప ఆమె కెరీర్‌ మళ్లీ మొదలయ్యే అవకాశం లేదు. నాలుగు పదుల వయసు దగ్గరకు వస్తున్న ఈ సమయంలో ఆమెకు హీరోయిన్‌ పాత్రలు ఎలా వస్తాయంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.