Begin typing your search above and press return to search.

యువ హీరో సినిమా ఆ వెబ్ సిరీస్ కి ప్రేరణగా ఉండబోతోందా...?

By:  Tupaki Desk   |   26 Sept 2020 6:00 AM IST
యువ హీరో సినిమా ఆ వెబ్ సిరీస్ కి ప్రేరణగా ఉండబోతోందా...?
X
ఆల్రెడీ రిలీజైన సినిమాలలో ఏదొక సన్నివేశాన్ని పాత్రను స్ఫూర్తిగా తీసుకొని మేకర్స్ సినిమాలుగా తీసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో కొందరు అదే విషయాన్ని యధాతధంగా కాపీ దొరికిపోతుంటారు.. మరికొందరు దొరక్కుండా క్రియేటివిటీ చూపిస్తారు. ఇప్పుడు తెలుగులో రూపొందుతున్న ఓ సినిమా.. ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతున్న సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ లోని ఓ పాయింట్ ని తీసుకొని తీస్తున్నారట. ఈ మధ్య ప్లాపుల్లో ఉన్న టాలీవుడ్ యువ హీరో ఇటీవల ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ఇండియాలోనే ఈ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న మొట్ట మొదటి చిత్రమని ప్రకటించారు. దీనికి తగ్గట్టే యువ హీరో సినిమా కోసం బాగానే కష్టపడుతున్నాడు. అయితే ఈ సినిమా ప్రచార చిత్రాలు రిలీజ్ అయిన తర్వాత ఇది ఓ వెబ్ సిరీస్ లోని పాత్రను ప్రేరణగా తీసుకొని రూపొందిస్తున్నారని ఫిలిం సర్కిల్స్ లో మాట్లాడుకుంటున్నారు.

ఇటీవల ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్ట్ నటించిన ఓ వెబ్ సిరీస్ రిలీజై ఓటీటీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంట్లో సదరు యాక్టర్ నటించిన పాత్ర కొత్తగా ఉండటంతో ప్రేక్షకులకు మంచి అనుభూతినిచ్చింది. అయితే ఇప్పుడు అతను పోషించిన పాత్రనే యువ హీరో ప్లే చేస్తున్నాడని ఫిల్మ్ న‌గర్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ యువ హీరో సినిమా విషయంలో ఇలాంటి కామెంట్స్ రావడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇంతకముందు ఈ హీరో నటించిన ఓ యాక్షన్ ఎంటర్టైనర్ కి ఇలాంటి ఇబ్బందులే వ‌చ్చాయి. ఓ వర్ధమాన రచయిత ఆ యాక్షన్ ఎంటర్టైనర్ స్టోరీ త‌న‌దేనని కంప్లైంట్ చేయడంతో.. అతనితో మాట్లాడి చివరికి సెటిల్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా రిలీజ్ అయిపోయిన ఓ వెబ్ సిరీస్ కథ నుంచి సినిమా చేస్తున్నారు. మ‌రి దీనిపై ఓటీటీ మరియు వెబ్ సిరీస్ మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.