Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో భారీ ఈవెంట్స్ ట్రెండ్ ముగిసిన‌ట్లేనా...?

By:  Tupaki Desk   |   6 Oct 2020 11:45 AM IST
టాలీవుడ్ లో భారీ ఈవెంట్స్ ట్రెండ్ ముగిసిన‌ట్లేనా...?
X
కరోనా మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీలో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కరోనా లాక్ డౌన్ కి ముందు.. లాక్ డౌన్ తర్వాత అని మాట్లాడుకునే రోజులు వచ్చాయి. ఒకప్పుడు సినిమా వస్తుందంటే ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు ఏదో ఒక ఫంక్షన్ చేస్తూ హడావిడి చేసేవారు. భారీ స్థాయిలో పొలిటిక‌ల్ మీటింగ్స్ పెట్టిన‌ట్లుగా సినిమాల ఫంక్ష‌న్స్ కూడా జ‌రిపేవారు. ఈ వేడుకలు నిర్వహణకు మేకర్స్ భారీగానే ఖర్చు చేసి ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలకు ఫంక్షన్ నిర్వహణ బాధ్యతలు అప్పగించేవారు. ప్రముఖ యాంకర్స్ తో హోస్ట్ చేపించేవారు. తమ అభిమాన నటీనటులను చూడటానికి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తరలి వచ్చి కరతాళధ్వనులతో సందడి సందడి చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. సినిమా ఆడియో వేడుకలు.. ప్రీ రిలీజ్ ఈవెంట్లు చూసి చాన్నాళ్ళై పోయింది. ఇకపై అలాంటి ఈవెంట్స్ చూడబోతున్నామో లేదో అనే సందేహాలు కలుగుతున్నాయి.

వాస్తవానికి బాలీవుడ్ లో ఇలాంటి సినిమా కోసం భారీ ఈవెంట్స్ చేయడం బంద్ చేసి చాలా ఏళ్లయింది. సింపుల్ గా ఓ ప్రెస్ మీట్ పెట్టి ప్రమోషన్స్ కానిచ్చేస్తుంటారు. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా ఇలాంటి మార్పులే చోటు చేసుకోబోతున్నాయి అంటున్నారు. ఇప్పటికే ఇలాంటి ప్రోగ్రామ్స్ పై ఆడియెన్స్ తో పాటు హీరోల‌కి కూడా బోర్ కొట్టేసిందని తెలుస్తోంది. అందుకే ఇకపై భారీ సినిమా ఈవెంట్స్ కాకుండా సింపుల్ అండ్ స్వీట్ గా మీటింగ్స్ ఉండాల‌ని సినీ ప్రముఖులు ఆలోచిస్తున్నారట. ఇటీవల ఓటీటీ లో రిలీజ్ అయ్యే సినిమాల ప్రమోషన్స్ కి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఆన్లైన్ లో జరిపిన సంగతి తెలిసిందే. 'ఒరేయ్ బుజ్జిగా' ఈవెంట్ కూడా చాలా సింపుల్ గా చేయడం చూసాం. అయితే ఈ నిర్ణ‌యం వల్ల టాలీవుడ్ లో సినీ ఈవెంట్స్ కి పేరుగాంచిన ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలకు పెద్ద దెబ్బ అనే చెప్పవచ్చు.