Begin typing your search above and press return to search.

'లైగ‌ర్' స్టోరీ మైక్ టైస‌న్ దేనా?

By:  Tupaki Desk   |   23 Aug 2022 8:30 AM GMT
లైగ‌ర్ స్టోరీ మైక్  టైస‌న్ దేనా?
X
మైక్ టైస‌న్ బాల్యం గురించి ప్ర‌పంచానికి తెలిసిందే. బాల్యంలో ఎంతో దుర్బ‌ర జీవితం గ‌డిపాడు. బాల్యం నుంచే ఆకుర్రాడిలో యాంగర్ పుట్టాడు. టైస‌న్ తొలి పంచ్ బాల్యంలోనే ప‌డింది. స‌మాజం..త‌ల్లిదండ్రుల మ‌ధ్య వాతావ‌ర‌ణ‌మే అత‌న్ని అంత‌గా రాటు దేలాలే చేసింది. త‌ల్లి-దండ్రుల మ‌ధ్య ఎప్పుడూ డిస్ట‌బెన్సెస్. దీంతో త‌ల్లి సంర‌క్ష‌ణ‌లోనే టైస‌న్ పెరిగి పెద్ద‌య్యాడు.

త‌ల్లి డిప్రెష‌న్ లో ఉండేది. దీంతో ఆ కోపాన్ని టైసన్ తొటి పిల్ల‌ల మీద చూపించేవాడు. ఆట మ‌ద్య‌లోనే అన‌వ‌స‌రంగా కొట్టేవాడు. దీంతో ఇంటి మీద‌కి కంప్లైట్స్. ఆ త‌ర్వాత టైస‌న్ త‌ల్లితో త‌న్నులు తినేవాడు. ఇది చూసి స్నేహితులు ఇంకా హేళ‌న చేసేవారు. దీంతో టైస‌న్ మ‌రింత‌గా ఇరిటేట్ అయ్యేవాడు. 13 సంవ‌త్స‌రాల వ‌య‌సు...38 సార్లు జైలుకెళ్లిన జీవితం.

దీంతో టైస‌న్ పై బాల్యంలోనే ప‌త్రిక‌ల్లో క‌థ‌నాలు వ‌చ్చేవి. ఇదంతా న్యూయార్క్ లో ఉన్న ఓ బాక్సింగ్ ట్రైన‌ర్ చూస్తాడు. టైస‌న్ లో ఆ యాంగ‌ర్ మేనేజ్ మెంట్..పంచ్ వప‌వ‌ర్ చూసి ఎలాగైనా బాక్సింగ్ నేర్పించాల‌నుకుంటాడు. అలా ఉన్న టైస‌న్ లో అత‌ని ప్ర‌తిభ‌ని త‌ట్టి లేపుతాడు. అదే టైస‌న్ జీవితాన్ని ప్రపంచ బాక్సింగ్ దిగ్గ‌జంగా మార్చింది.

స‌రిగ్గా ఇదే స‌న్నివేశం క‌నిపిస్తుంది 'లైగ‌ర్' ప్రచార చిత్రాల్లో. సాలా క్రాస్ బ్రీడ్ అంటూ 'లైగ‌ర్' ఈనెల 25న ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో విజ‌య్ త‌ల్లి పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుంది. ముంబై బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ ఇది. త‌ల్లీ కొడుకు ఇద్ద‌రు ఛా య్ వాలా బ్యాచ్. స్ల‌మ్ డాగ్ మిలీయ‌నీర్ టైపులో లైఫ్ ని లీడ్ చేస్తుంటారు. ర‌మ్య పాత్ర సైతం ఎంతో ఱ‌ప్ గా ఉంటుంద‌ని తెలుస్తోంది.

త‌ల్లి పెంప‌కంలోనే విజ‌య్ పెరిగి పెద్ద‌వుతాడు. ఎంతో మాస్ వాతావ‌ర‌ణంలోనే అదంతా జ‌రుగుతుంద‌ని టీజ‌ర్ లోనే రివీల్ చేసారు. దీంతో మైక్ టైస‌న వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన కొన్ని అంశాల్ని తీసుకుని లైగ‌ర్ క‌థ‌ని సిద్దం చేసిన‌ట్లు క‌నిపిస్తుంద‌ని ప్ర‌చారం సాగుతోంది.

విజ‌య్ పాత్ర‌కి స్ఫూర్తి బాక్సింగ్ దిగ్గ‌జం టైస‌న్ అనే సందేహాలు మ‌రింత బ‌ల‌ప‌డుతున్నాయి. ఆ కార‌ణంగానే టైస‌న్ ని 'లైగ‌ర్' లో భాగం చేసారా? అన్న సందేహం తెర‌పైకి వ‌స్తుంది. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెంతో ? సినిమా రిలీజ్ అయితే గానీ క్లారిటీ రాదు.