Begin typing your search above and press return to search.

`స‌రైనోడు` కాంబినేష‌న్ రిపీట‌వుతోందా?

By:  Tupaki Desk   |   13 Sep 2020 5:30 PM GMT
`స‌రైనోడు` కాంబినేష‌న్ రిపీట‌వుతోందా?
X
చిరంజీవి.. ప్ర‌భాస్ .. ఎన్టీఆర్.. మ‌హేష్ లాంటి స్టార్లు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని ఖాయం చేసుకుంటున్నారు. వ‌రుస‌గా స్క్రిప్టులు విని న‌చ్చితే వెంట‌నే వాటికి ఓకే చెప్పేస్తున్నారు. ఇప్పుడు అదే బాట‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పీడ్ పెంచిన‌ట్టే క‌నిపిస్తోంది.

సుకుమార్ త‌ర్వాత ఇంకెవ‌రు? అన్న ప్ర‌శ్న వ‌స్తే బ‌న్ని లిస్ట్ లో కొన్ని పేర్లు ఉన్నాయి. కానీ ఏదీ పూర్తిగా అధికారికంగా క‌న్ఫామ్ చేయ‌డం లేదు. సుక్కూతో `పుష్ప` చిత్రీక‌ర‌ణ ఈనెలాఖ‌రు లేదా వ‌చ్చే నెల మొద‌టివారంలో మొద‌లు పెడ‌తార‌న్న స‌మాచారం ఉంది. త‌దుప‌రి సింగిల్ షెడ్యూల్లోనే దీనిని ముగించేస్తే మ‌హ‌మ్మారీ ఎఫెక్ట్ నుంచి కొంత‌వర‌కూ ఉప‌శ‌మ‌నం ల‌భించిన‌ట్టేన‌ని భావిస్తున్నార‌ట‌.

అదంతా స‌రేకానీ.. సుక్కూ త‌ర్వాత ఎవ‌రితో ఉంటుంది? అంటే అనూహ్యంగా `స‌రైనోడు` కాంబినేష‌న్ రిపీట్ అంటూ ప్ర‌చారం మొద‌లైంది. బాల‌య్య‌తో శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ ముగించి త‌దుప‌రి బ‌న్నితో సినిమా చేయాల‌ని బోయ‌పాటి ఉవ్విళ్లూరుతున్నాడ‌ట‌. ఇప్ప‌టికే లైన్ చెప్పి ఓకే చేయించుకున్న బోయ‌పాటి సైలెంటుగా స్క్రిప్టు ప‌ని ముగించేయ‌నున్నాడ‌ట‌. అప్ప‌టికి బ‌న్ని కూడా ఫ్రెష్ గా సినిమా చేసేందుకు రెడీ అవుతాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. బ‌న్ని క్యూలో కొర‌టాల శివ‌.. కేజీఎఫ్ ప్ర‌శాంత్ నీల్.. మురుగ‌దాస్.. యాత్ర మ‌హి.వి.రాఘ‌వ్ పేర్లు వినిపిస్తున్నాయి. అందుకే బోయ‌పాటితో మూవీని అధికారికంగా క‌న్ఫామ్ చేయాల్సి ఉంటుంది.