Begin typing your search above and press return to search.

మహేష్ ఆలోచన వెనుక అంత ప్లానింగ్ ఉందా ?

By:  Tupaki Desk   |   7 Jun 2019 5:21 AM GMT
మహేష్ ఆలోచన వెనుక అంత ప్లానింగ్ ఉందా ?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు విదేశాల్లో ఉన్నా ఇక్కడ మహర్షి రన్ బాగానే కొనసాగుతోంది. మొదటి వారంలో చేసిన అగ్రెసివ్ ప్రమోషన్ సినిమాకు హెల్ప్ అవుతోంది. దానికి తోడు ప్రతివారం వస్తున్న కొత్త సినిమాలు మరీ దారుణంగా ఉండటంతో వీకెండ్ వసూళ్ళను తనవైపుకు లాక్కోవడంలో ప్రిన్స్ సక్సెస్ అవుతున్నాడు. ఇటీవలే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ చేయనున్న సరిలేరు నీకెవ్వరు పూజతో మొదలైన సంగతి తెలిసింది.

ముందు దీనికి ఇద్దరు నిర్మాతలు అని ప్రచారం జరిగింది. అనిల్ సుంకరతో పాటు దిల్ రాజు ఉంటారని అఫీషియల్ నోట్ ఇచ్చారు. ఆ తర్వాత రాజు గారు తప్పుకున్నారని కేవలం అనిల్ సోలో ప్రొడ్యూసర్ గా సింగల్ కార్డు పడుతుందని ఓ టాక్ వచ్చింది. తీరా టైటిల్ రివీల్ పోస్టర్ లో ఈ ఇద్దరితో పాటు మూడో బ్యానర్ గా మహేష్ బాబు తనది కూడా చేర్చడం అనూహ్యమే అని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఇండస్ట్రీలో ఇంకో టాక్ వినిపిస్తోంది. మహర్షి వసూళ్ళలో దానికి నిర్మాతలలో ఒకడిగా నిలిచిన దిల్ రాజు స్ట్రాటజీలతో పాటు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ బాగా పని చేసింది.

ఇది గుర్తించి సరిలేరు నీకెవ్వరులో ఆయన అంత సుముఖంగా లేకపోయినా మహేష్ స్వయంగా ఒప్పించినట్టు వినికిడి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత తానొక్కడే నిర్మాతగా మహేష్ సినిమా కోసం ఎదురు చూస్తున్న దిల్ రాజు ఇలా ఇతర నిర్మాతలతో టై అప్ కావడం అంతగా ఇష్టం లేదని అయినా ప్రిన్స్ మాట కాదనలేక ఎస్ చెప్పారని ఓ టాక్ ఉంది. ఏది నిజమో కాదో చెప్పలేం కాని మొత్తానికి మహేష్ స్కెచ్ మాత్రం బాగుంది. వంద కోట్లకు పైగా పెట్టుబడులు సాగుతున్న తన సినిమాను ఎక్కువ జనానికి రీచ్ అయ్యేలా చేయడంలో కీలకంగా వ్యవహరించే దిల్ రాజు లాంటి నిర్మాతలను పార్ట్ నర్ గా పెట్టుకోవడం కంటే మంచి ఎత్తుగడ ఏముంటుంది