Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీలో నిర్మాణ సంస్థల జీతాల చెల్లింపులు ఇవేనా..?

By:  Tupaki Desk   |   6 July 2020 3:40 PM IST
ఇండస్ట్రీలో నిర్మాణ సంస్థల జీతాల చెల్లింపులు ఇవేనా..?
X
కరోనా దెబ్బతో ఫిల్మ్ ఇండస్ట్రీలు భారీగా దెబ్బతిన్నాయి. అందులో ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ. ఏడాదిలో ప్రతిసారి అన్నీ ఇండస్ట్రీల కంటే ఎక్కువ సినిమాలు విడుదల అయ్యేది తెలుగు పరిశ్రమలోనే. ఎందుకంటే బిజినెస్ పరంగా బాలీవుడ్ తర్వాత సెకండ్ స్థానంలో టాలీవుడ్ ఉంది. ఎక్కువ సినిమాలు రూపొందుతూ.. లక్షల మందికి ఉపాధి లభించేది. ఒక్కసారిగా కరోనా రావడంతో థియేటర్లు మూతపడి.. సినిమాలు ఆగిపోయి.. షూటింగ్స్ లేక అంతా రోడ్డెక్కారు. అయితే షూటింగ్స్ లేకపోయినా కొందరు ఆర్థిక సాయం పొందుతున్నారు. కానీ దర్శక నిర్మాతల వద్ద పనిచేసే స్టాఫ్ లకు నిర్మాణ సంస్థే చెల్లించాల్సి ఉంటుంది.

కార్మికులు, టెక్నీషియన్లు మూడు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం పనిచేస్తున్న సినీ నిర్మాణ సంస్థలు ఎవరికీ ఎలా చెల్లిస్తున్నాయని ఆసక్తికరంగా మారింది. ఇక మొదటగా ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న రాంచరణ్.. ఎన్టీఆర్ లకు నిర్మాత కేవలం అడ్వాన్స్ మాత్రమే చెల్లించాడట. కానీ రిలీజ్ తర్వాత కొన్ని ఏరియాల హక్కులను తీసుకున్నాడట. ఇక రాజమౌళి టీమ్ అందరికి కలిపి ఇప్పటికే 30 కోట్ల వరకు చెప్ల్లించాడట నిర్మాత దానయ్య. అంతేగాక డైరెక్షన్ డిపార్టుమెంటు వారికి నెక్స్ట్ నెల నుండి జీతాలు ఆపారట. వాళ్లందరికీ షూటింగ్ స్టార్ట్ అయ్యాకే ఇస్తామన్నారట. ఇక సూపర్ స్టార్ మహేష్ - పరశురామ్ సర్కారు వారి పాట టెక్నీషియన్లకు ఫుల్ సాలరీస్ ఇస్తున్నారట.

అలాగే అల్లు అర్జున్ 'పుష్ప' టీమ్ హాఫ్ సాలరీ ఇస్తుండగా.. బాలకృష్ణ బిబి3 టీమ్ లకు హాఫ్ సాలరీస్ ప్రకటించారట. ఇక సితార సంస్థ కొందరిని తొలగించి ఉన్నవాళ్ళకి ఫుల్ పేమెంట్ ఇస్తున్నారట. గీతా ఆర్ట్స్ వారు ప్రస్తుతం అడ్వాన్సులు మాత్రమే ఇచ్చారు. ఇక షూటింగ్స్ స్టార్ట్ అయితే ఫుల్ పేమెంట్ ఇవ్వనున్నారట. యూవీ క్రియేషన్స్ వారు ఫుల్ సాలరీస్ ఇస్తుండగా.. దిల్ రాజు టీమ్ హాఫ్ శాలరీ చెల్లిస్తుందట. చివరిగా వైజయంతి సంస్థ ఉన్నవాళ్లకు మాత్రమే సగం సాలరీస్ ఇస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలా జరుగుతుందని అంటున్నారు.