Begin typing your search above and press return to search.

మెగాస్టార్ కోసం కింగ్ మెట్టు దిగుతున్నాడా?

By:  Tupaki Desk   |   13 Sep 2022 11:30 AM GMT
మెగాస్టార్ కోసం కింగ్ మెట్టు దిగుతున్నాడా?
X
మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున ఎన్నో ఏళ్లుగా మంచి స్నేహితులు, ప‌లు వ్యాపారాల్లో భాగ‌స్వాములు కూడా. ఏ విష‌యంలోనూ ఇంత వ‌ర‌కు వీరిద్ద‌రి మ‌ధ్య పోటీ జ‌రిగింది లేదు.. వీరు పోటీప‌డిన సంద‌ర్భ‌మూ లేదు. అయితే ఇండ‌స్ట్రీలో మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా వున్న ఈ ఇద్ద‌రు సీనియ‌ర్ హీరోలు ఈ ద‌స‌రాకు పోటీప‌డ‌బోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న భారీ యాక్ష‌న్ డ్రామా 'గాడ్ ఫాద‌ర్‌'. మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ 'లూసీఫ‌ర్‌' ఆధారంగా ఈ మూవీని మోహ‌న్ రాజా తెలుగులో రీమేక్ చేస్తున్న‌విష‌యం తెలిసిందే.

భారీ స్థాయిలో రూపొందుతున్నఈమూవీలో తొలిసారి మెగాస్టార్ సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్ లో ఎలాంటీ హీరోయిన్ లేకుండా ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. న‌య‌న‌తార చెల్లెలు పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీని ద‌స‌రాకు అక్టోబ‌ర్ 5న‌ రిలీజ్ చేయాల‌ని డేట్ ప్ర‌క‌టించేశారు. ఇందు కోసం ఏర్పాట్లు కూడా జ‌రుగుతున్నాయి.

ఇదిలా వుంటే స‌రిగ్గా అదే రోజున కింగ్ నాగార్జున న‌టిస్తున్న హై వోల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'ది ఘోస్ట్' రిలీజ్ కాబోతోంది. ప్ర‌వీణ్ స‌త్తారు డైరెక్ష‌న్ లో తెర‌కెక్కిన ఈ మూవీలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా న‌టించగా కీల‌క పాత్ర‌ల్లో గుల్ ప‌నాగ్‌, అనికా సురేంద్ర‌న్ న‌టించారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. ట్రైల‌ర్ తో భారీ బ‌జ్ క్రియేట్ కావ‌డంతో ఈ సారి కింగ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకోవ‌డం గ్యారంటీ అని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

అయితే మెగాస్టార్ 'గాడ్ ఫాద‌ర్‌' అక్టోబ‌ర్ 5నే రిలీజ్ అవుతుండ‌టంతో త‌న‌తో క్లాష్ కి సుముఖంగా లేని నాగార్జున 'ది ఘోస్ట్' రిలీజ్ ని పోస్ట్ పోన్ చేసుకుంటున్నాట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అక్లోబ‌ర్ 5న కాకుండా 7న శుక్ర‌వారం ఈ మూవీని రిలీజ్ చేయాల‌ని నాగ్ నిర్ణ‌యించిన‌ట్టుగా తెలుస్తోంది. స్నేహితుడు చిరంజీవికి పోటీగా త‌న సినిమాని రిలీజ్ చేయ‌డం ఇష్టంలేక‌నే నాగ్ ఓ మెట్టు దిగి త‌న సినిమాని 7న రిలీజ్ చేయాల‌నుకుంటున్నాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

నాగ్ నిర్ణ‌యానికి సంబంధించిన అధికారిక వార్త త్వ‌ర‌లోనే బ‌య‌టికి రానున్న‌ట్టుగా తెలుస్తోంది. మెగాస్టార్ న‌టించిన 'గాడ్ ఫాద‌ర్‌' ప్ర‌మోష‌న్స్ మ‌రో వారంలో ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలోనే నాగ్ .. మెగాస్టార్ కోసం వెన‌క్కి త‌గ్గుతున్నారా? లేదా అనే విష‌యంలో స్ప‌ష్ట‌త రానుంద‌ని తెలుస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.