Begin typing your search above and press return to search.
ప్రభుత్వం ఇలాంటి షరతులతో సినిమా షూటింగ్స్ కి అనుమతిస్తుందా?
By: Tupaki Desk | 16 May 2020 11:45 AM ISTదేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ఆర్థిక వ్యవస్థ అస్థవ్యస్తంగా మారి పోయింది. కరోనా మహమ్మారి అన్ని రంగాల మీద తన ప్రభావాన్ని చూపించింది. అయితే గత రెండు నెలల నుండి మూసివేయబడిన అన్ని రంగాలను కేంద్రం నెమ్మదిగా సడలిస్తూ వస్తోంది. కానీ సినీ రంగం మీద ఇంకా సడలింపులు ఇవ్వలేదు. కరోనా ప్రభావం ఎక్కువగా పడిన రంగాల్లో సినీరంగం ఒకటి అని చెప్పవచ్చు. లాక్ డౌన్ వల్ల చిత్ర పరిశ్రమ క్లోజ్ అయింది. ఇప్పటికే సినిమా షూటింగు ఆగిపోవడంతో దాని మీద ఆధారపడి జీవిస్తున్న చాలా కుటుంబాల పరిస్థితి దారుణంగా తయారైంది. నిర్మాతలు కూడా ఫైనాన్సియర్స్ దగ్గర తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ఎత్తేసి షూటింగులకు ఎప్పుడు అనుమతిస్తారా అని వెయిట్ చేస్తున్నారు. ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిన వెంటనే షూటింగ్స్ స్టార్ట్ చేయాలని చాలా మంది నిర్మాతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే సినిమా షూట్ కోసం కఠినమైన మార్గదర్శకాలను జారీ చేయడానికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సమాచారం. ఇప్పటి నుండి సినిమా షూటింగ్స్ స్టార్ట్ చేయాలనుకున్నవారు కరోనా హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుందట. సినిమా యూనిట్ మొత్తం అంటే తారాగణం మరియు సిబ్బంది కరోనావైరస్ బారిన పడకుండా చూసుకుంటామని ధృవీకరణ పత్రంతో రావాలన్న మాట. ఒకవేళ కరోనా వైరస్ బారినపడి కాస్టింగ్ లేదా సిబ్బంది నుండి ఎవరైనా చనిపోతే ఈ చిత్ర నిర్మాతలు మరణించిన వారి కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం చెల్లించాలని షరతు పెట్టే అవకాశం ఉందట. ఇదే కనుక నిజమైతే సినిమాల సెట్స్ లో ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగితే నిర్మాతలకు ఇది భారీ భారం అవుతుంది. ఎన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకున్నా భవిష్యత్ లో ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఇలాంటి నేపథ్యంలో ప్రొడ్యూసర్స్ డేర్ గా ముందుకు వెళ్తారని అనుకోవడం లేదు. ఇవే మార్గదర్శకాలు చిన్న సినిమాలు మరియు టెలివిజన్ షూటింగులకు కూడా వర్తించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వం ఇటువంటి మార్గదర్శకాలతో వస్తే మాత్రం చాలా మంది చిత్రనిర్మాతలు కరోనా వైరస్ భయాలు తొలగిపోయే వరకు వేచి చూసే ధోరణి అవలంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం నడుస్తున్న లాక్ డౌన్ ఈ నెల 17తో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఎలాంటి షరతులతో షూటింగులకు అనుమతిస్తారో చూడాలి.