Begin typing your search above and press return to search.
పవన్ ద్విపాత్రాభినయం లుక్ ఫైనల్ అయ్యిందా?
By: Tupaki Desk | 27 April 2021 7:00 AM ISTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారా? అంటే అవుననే సమాచారం. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పీఎస్ పీకే 28తో ఇది సాధ్యమవుతోందన్న గుసగుసలు తాజాగా వైరల్ అవుతున్నాయి.వివరాల్లోకి వెళితే.. వకీల్ సాబ్ తో మూడేళ్ల విరామం తర్వాత వెండితెరపైకి వచ్చిన పవన్ గ్రేట్ కంబ్యాక్ గురించి ఇటీవల ఆసక్తికర చర్చ సాగుతోంది. బాక్సాఫీస్ వద్ద తొలి వీకెండ్ అసాధారణ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం కోవిడ్ వల్ల కొంత లాస్ ని భరించాల్సొచ్చింది.
పవన్ ప్రస్తుతం తదుపరి సినిమాలపైనా దృష్టి సారించారు. అయ్యప్పనున్ కోషియం రీమేక్ తో పాటు హిస్టారికల్ కాన్సెప్టుతో రూపొందుతున్న హరి హర వీర మల్లు చిత్రీకరణల్ని పూర్తి చేయాల్సి ఉండగా కోవిడ్ సోకి చికిత్స పొందుతున్నారు. తరువాత హరీష్ శంకర్ పీఎస్ పీకే28 కి పవన్ కమిట్ మెంట్ ఇచ్చారు.. ఈ సినిమాలన్నీ అత్యంత భారీ బడ్జెట్ తో క్రేజీగా తెరకెక్కుతున్నవే.
తాజాగా పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైలిస్ట్ రామ్ ఓ కీలకమైన సమాచారాన్ని లీక్ చేశారు. పిఎస్‌పికె 28 లుక్ విషయంలో క్రేజ్.. వకీల్ సాబ్ కంటే 10 రెట్లు పెద్దదిగా ఉంటుందని ఆయన అన్నారు. లుక్ గురించి హరీష్ శంకర్ పవన్ ల మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగింది. స్టైలిస్ట్ తనవంతు సాయమందిస్తున్నారు. ఇటీవల ముగిసిన ఫోటోసెషన్ ను హరీష్ శంకర్ త్వరలో రిలీజ్ చేయనున్నారు. హరీష్ శంకర్ చిత్రంలో పవన్ ద్విపాత్రాభినయంతో సర్ ప్రైజ్ చేస్తారని లెక్చరర్ పాత్రలోనూ కనిపిస్తారని కూడా లీకులందుతున్నాయి. మొత్తానికి పవన్ అభిమానుల్ని ఖుషీ చేసే చాలా సంగతులు రివీలయ్యాయి. పవన్ - హరీష్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే.