Begin typing your search above and press return to search.

ఆ న‌లుగురి కోసం హ‌రీష్ స్క్రిప్టులు

By:  Tupaki Desk   |   3 Feb 2022 3:30 AM GMT
ఆ న‌లుగురి కోసం హ‌రీష్ స్క్రిప్టులు
X
మాస్ మ‌సాలా యాక్ష‌న్ సినిమాల‌ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ దృష్టిలో న‌లుగురు అగ్ర హీరోలున్నారు. ఇప్ప‌టికే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం అత‌డు స్క్రిప్ట్ రెడీ చేశాడు. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది. ఇంత‌లోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కోసం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంద‌ని స‌మాచారం.

హ‌రీష్ ఇంత‌కుముందు బ‌న్నీతో డీజే లాంటి హిట్ సినిమాని తీశాడు. అందుకే ఇప్పుడు అత‌డికి అవ‌కాశం ఉంది. ఇక ప‌వ‌న్- బ‌న్నీల‌తో పాటు సాయి తేజ్.. ఎన్టీఆర్ ల కోసం కూడా అత‌డు స్క్రిప్టులు రెడీ చేస్తున్నాడు. అయితే ప్ర‌స్తుతం సెట్స్ కి వెళ్ల‌నున్న ప‌వ‌న్ సినిమా విజ‌యం ప్ర‌తిదీ డిసైడ్ చేస్తుంది.

తాజాగా అల్లు అర్జున్ కోసం హరీష్ శంకర్ ఒక స్క్రిప్ట్ రాస్తున్నాడనేందుకు ఉప్పందింది. అతను అల్లు హీరోతో ఒక ప్రాజెక్ట్ కోసం చాలా కాలంగా వేచి చూస్తున్నాడు. కానీ ఆ టైమ్ రాలేదు ఇంత కాలంగా. తాజాగా హరీష్ శంక‌ర్.. అల్లు అర్జున్‌తో సమావేశమయ్యారు. ఆ విష‌యాన్ని సోషల్ మీడియాలో స్వ‌యంగా వెల్ల‌డించారు హ‌రీష్‌.

``మనం ఎప్పుడు కలిసినా నవ్వే అల్లరి. అల్లు అర్జున్ .. మీతో సరదాగా గడిపాను. తదుపరి సమయం వరకు.. లవ్ యు #త‌గ్గేదేలే.. ఎందుకు త‌గ్గాలి?`` అంటూ వ్యాఖ్యానించారు. దీన‌ర్థం మ‌రో సినిమా చేస్తార‌ని అభిమానులకు హ‌రీష్ హింటిచ్చారు. అల్లు అర్జున్ తో కలిసి ఉన్న ఫోటోకు హ‌రీష్ ఓ ఆస‌క్తిక‌ర క్యాప్షన్ ఇచ్చాడు. డీజే జోడీ మ‌ళ్లీ కలిసి పని చేయనున్నారనే దానికి ఇది సింబాలిక్ అనుకోవాలి.